'పెళ్లి చేసుకోవడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను'

16 Aug, 2021 17:17 IST|Sakshi

శ్రీముఖి.. ఓ వైపు బుల్లితెరపై స్టార్‌ యాంకర్‌గా కొనసాగుతూనే మరోవైపు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంది . తాజాగా సినీ గాయకుడు మనో, నటులు రాజా రవీంద్ర, భరణిలతో కలిసి 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో నటించింది. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాను సినిమాను గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ నిర్మించారు. ఈనెల 19న ఈ సినిమా  విడుదల కానుంది.


ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న శ్రీముఖి పర్సనల్‌ లైఫ్‌కి సంబంధించి పలు  ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పెళ్లి చేసుకోవడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మంచి వ్యక్తి దొరకడానికి టైం పడుతుంది. ఏదైనా మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నాకు 28 ఏళ్లు. సో 31 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలనుంది అంటూ తన మనసులో మాటను బయటపెట్టేసింది. 
 

మరిన్ని వార్తలు