లాక్‌డౌన్‌ టైంలోనూ రెండు చేతులా సంపాదిస్తున్న సుమ.. ఎలాగంటే..

15 Jun, 2021 12:15 IST|Sakshi

యాంకర్‌ సుమ..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తికాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకరింగ్‌లో త‌న‌కు ఎవ‌రూ సాటి లేర‌న్న విధంగా ముందుకు సాగుతుంది.   ఆడియో ఫంక్ష‌న్‌, ఈవెంట్ సహా పలు టీవీ షోలలో యాంకర్‌గా రెండు చేతులా సంపాదిస్తుంది సుమ. అయితే కరోనా ప్రభావం చిత్ర పరిశ్రమపై కూడా పడింది. దీంతో షూటింగులు నిలిచిపోయి, పలు సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే సుమ మాత్రం లాక్‌డౌన్‌ సమయంలోనూ బాగానే సంపాదిస్తుంది. ఈ మధ్య కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవమరిస్తున్న సుమ..వాటిని బాగానే ప్రమోట్‌ చేస్తుంది. రీసెంట్‌గా ఇడ్లీ డే అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది.

మదర్స్‌ డే, ఫాదర్స్‌ డే, బ్రదర్స్‌ డే లాగానే ఇడ్లీ డే కూడా ఉందంటూ తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చింది. ఇడ్లీలు ఆరోగ్యానికి ఎంతో మంచివంటూనే ఓ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తూ వీడియోను పోస్ట్‌ చేసింది.  బుల్లితెరపైనే కాదు సోషల్‌ మీడియాలోనూ సుమ చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఫన్నీ వీడియోలతో పాటు వంట వీడియోలు చేస్తూ తన అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో ముందుటుంది. తాజాగా సుమ ప్రమోట్‌ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు కొందరు సెటైర్లు వేస్తున్నారు. డైరెక్ట్‌గా అడ్వర్టైజ్‌మెంట్‌ వీడియో అని చెప్పకుండా, ఇలా ఇడ్లీ డే అంటూ ఎందుకు చెప్పడం అంటూ కామెంట్లు చేస్తుంటే, మరికొందరు మాత్రం లాక్‌డౌన్‌ టైంలోనూ రెండు చేతులా సంపాదిస్తుంది నువ్వే సుమక్కా అని పేర్కొంటున్నారు. 

చదవండి : ఆ నటి పరువు తీసేసిన యాంకర్‌ సుమ.. షోలో ఏం చేసిందంటే!
బుల్లితెరపై శివగామిలా అదరగొడుతున్న రాశీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు