రాజీవ్‌పై సుమ ఎమోషనల్‌ ట్వీట్‌.. వైరల్

15 Sep, 2020 08:33 IST|Sakshi

తెలుగు టెలివిజన్‌ రంగంలో పెద్దగా పరిచయం అక్కరలేని పేరు యాంకర్‌ సుమ. తన యాంకరింగ్‌ టాలెంట్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. దశాబ్ద కాలంగా తెరపై ఎన్నో సినీ కార్యక్రమాలను, ఈవెంట్స్‌ చేస్తూ ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందుంటారు. తన భర్త రాజీవ్‌ కనకాల టాలీవుడ్‌లో పెద్ద నటుడే అయినప్పటికీ తన కంటే ఎక్కువ క్రేజ్‌ సుమ సొంతం చేసుకుందని చెప్పక తప్పదు. అంతేకాదు ఇండస్ట్రీలో మంచి జోడీగా కూడా వీరిద్దరికి గుర్తింపుఉంది. (షూటింగ్‌లు స్టార్ట్‌.. యాంకర్స్‌ సందడి)

అయితే ఈ మధ్య కాలంలో సుమ-రాజీవ్‌ వైవాహిక జీవింత గురించి పెద్ద ఎత్తున రూమర్స్‌ వినిపించాయి. వారి వివాహ బంధంలో విభేదాలు వచ్చాయని, ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నారని పుకార్లు షికారు చేశాయి. అంతేకాదు రాజీవ్‌ నుంచి సుమ విడాకులు కూడా కోరిందని సోషల్‌ మీడియా కోడైకూసింది. ఈ వార్తలు టీ టౌన్‌లో కూడా చర్చనీయాంశంగా మారాయి. అయినా కూడా ఈ జోడీ కనీసం స్పందించకపోవడంతో అంతా నిజమేఅని అనుకున్నారు. ఈ క్రమంలోనే సుమ చేసిన ఓ ట్వీట్‌ సోషల్‌ మీడియా రాయుళ్ల ఊహాగానాలను పటాపంచల్‌ చేసింది. తమపై వస్తున్న వార్తలకు చెక్‌పెడుతూ.. సుమ తన ట్విటర్‌ ఖాతా ద్వారా రాజీవ్‌పై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఓ సందేశం ఇచ్చింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

రాజీవ్ కనకాలను ఆప్యాయంగా హత్తుకుని ఎమోషనల్‌గా భావాన్ని చూపించింది. ’నా ప్రియమైన రాజా.. మై లవ్.. ఎప్పటికైనా నువ్వే నా జీవితం, నువ్వే నా ఆనందం’ అంటూ తమ వైవాహిక జీవితం ఎంత బలంగా ఉందో చాటిచెప్పింది. అందమైన జంట అని కొందరు కామెంట్‌ పెడుతుండగా.. ఇంత అన్యోన్యమైన కపుల్‌ మధ్య అనవసరమైన రూపర్స్‌  ఆపండి అంటూ మరికొంతమంది రిప్లే ఇస్తున్నారు. భార్యాభర్తలు అన్నాక వారి మధ్య ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటన్నింటినీ సోషల్‌ మీడియాలో పెద్దవి చేసి చూపించడం సరైనది కాదంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు