పొట్టి వీరయ్య మృతి: ఉదయభాను భావోద్వేగం

26 Apr, 2021 17:00 IST|Sakshi

ఒకప్పుడు యాంకర్‌గా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ప్రముఖ యాంకర్ ఉదయభాను. ఇక సినిమాల్లో సైతం పలు పాత్రల్లో నటించి నటిగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారామె. తన గలగల మాటలతో ప్రేక్షకదారణ పొందిన ఆమె అప్పట్లో యాంకర్‌గా బుల్లితెరను ఏలిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వార్తల్లో నిలిచిన ఆమె ఆ తర్వాత యాంకరింగ్‌కు, నటనకు బ్రేక్‌ ఇచ్చారు. అనంతరం కొంతకాలానికి ఓ ఛానల్‌లో ప్రసారమైన పిల్లలు పిడుగులు అనే షో ద్వారా ఉదయభాను మళ్లీ యాంకర్‌గా సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్లారు.

ఇక ఈ షోను నుంచి కూడా తప్పుకున్న ఆమె అప్పటి నుంచి బుల్లితెరపై కనిపించడం తగ్గించారు. ఈ నేపథ్యంలో బయట జరుగుతున్న అఘాయిత్యాలపై అప్పడప్పుడు స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా ఉదయభాను ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య మరణంతో మరోసారి తెరపైకి వచ్చారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న పొట్టి వీరయ్య నిన్న(ఆదివారం) గుండెపోటుతో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణానికి మెగాస్టార్‌ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ఉదయభాను కూడా ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నానంటూ కంటతడి పెట్టుకున్నారు. అంతేకాకుండా తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్‌తో అందరినీ కంటతడి పెట్టించారు.‘వీరయ్య అంకుల్ మరణవార్త తెలియగానే హృదయం ముక్కలైనట్టు అనిపించింది. ఇది భరించలేని నిజమని చెప్పడానికి ఎంతో బాధగా ఉంది. ఇప్పుడు కలుగుతున్న బాధను మాటల్లో చెప్పలేకపోతున్నా.  మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాను అంకుల్. ఓ మంచి వ్యక్తిని ఈ ప్రపంచం కోల్పోయింది. దేవుడా మా మీద అయిన కొంచెం దయచూపు’ అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. 

చదవండి: 
Potti Veeraiah: పొట్టి వీర‌య్య క‌న్నుమూత‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు