క్యూట్‌గా నవ్వులు చిందిస్తున్న ఈ కవలలు ఎవరో తెలుసా?

17 Aug, 2021 13:42 IST|Sakshi

ఎంతో క్యూట్‌గా నవ్వులు చిందిస్తున్న ఈ కవలలు ఎవరో తెలుసా? అలా అడిగితే గుర్తు పట్టడం కష్టం కానీ, మీకోసం ఈ ఫోటోకి సంబంధించి ఒక క్లూ ఇస్తే గుర్తు పట్టగలరేమో చెక్ చేసుకోండి. ఆ కవలల తల్లి టాలీవుడ్‌లో ఓ ప్రముఖ యాంకర్‌. అంతేకాదు హీరోయిన్‌గా కూడా కొన్ని సినిమాల్లో నటించింది. బుల్లి తెరపై తెలుగు తొలి తరం యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ క్లూతో అయినా వారెవరో గుర్తించారా? గుర్తించటం కష్టంగా ఉందా..? ఓకే.. విషయం మేమే చెప్పేస్తాం. చిరు నవ్వులు చిందిస్తున్న ఈ క్యూట్‌ కవలలు.. యాంకర్‌ ఉదయభాను కూతుళ్లు.

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఉదయం భాను. ఒకప్పుడు తెలుగులో టాప్‌ యాంకర్‌గా రాణించింది. ఆమెను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది యాంకర్స్‌ బుల్లి తెరపైకి రంగ ప్రవేశం చేశారు. ఆమె నిన్న మొన్నటి వరకు కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తూనే ఉంది.  

గర్భవతి అయినప్పటి నుంచి ఉదయ భాను యాంకరింగ్‌కి దూరంగా ఉంది. కవల పిల్లలకు జన్మనిచ్చిన చాలా రోజుల తర్వాత ఆమె కెమెరా ముందుకు వచ్చింది. ఆ మధ్య ఓ టీవీ చానల్‌ ప్రోగ్రామ్‌కి గెస్ట్‌గా వచ్చిన ఉదయ భాను.. తన ఇద్దరు పిల్లలను, భర్తను పరిచయం చేసింది. ఉదయభాను ఇప్పటి కూడా మునుపటి మాదిరే అందంగా ఉంది. దీంతో ఆమె మళ్లీ బుల్లి తెరపైకి వస్తుందేమో అని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం బుల్లి తెరపై సుమ, అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటి వారు సత్తా చాటుతున్నారు. మరి వారికి పోటీగా ఈమె నిలుస్తుందా అనేది చూడాలి.

 


 

 

మరిన్ని వార్తలు