అతడితో సీక్రెట్‌ డేటింగ్‌ చేస్తోన్న యాంకర్‌ వర్షిణి!

3 May, 2021 19:21 IST|Sakshi

నటిగా వెండితెరపై మెరిసిన వర్షిణి.. ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్‌గా సెటిలైపోయింది. వరుస ఆఫర్లు చేజిక్కించుకుంటూ అనసూయ, శ్రీముఖి, రష్మీలకు గట్టి పోటీ ఇస్తోంది. ఇక గ్లామర్‌ విషయంలో కూడా వీరందరిక కంటే కాస్తా వర్షిణిదే పైచేయి. తన అమాయకత్వం, చిలిపితనంతో యువతను ఆకట్టుకుంటున్న వర్షిణి సోషల్‌ మీడియాలో సైతం తరచూ ట్రెడిషినల్‌, గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.

ఆ మధ్య జబర్దస్త్‌ కమెడియన్స్‌ హైపర్‌ ఆది, సుడిగాలి సుధీర్ల సరసన యాంకర్‌గా చేసి వారితో లవ్‌ ట్రాక్‌కు తెరలేపిన ఆమె తాజాగా ఓ ఫొటో షేర్‌ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఓ వ్యక్తి భజంపై తన తల వాల్చి నిద్రపోతున్న ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. అయితే కాసేపటికే ఈ స్టోరిని ఆమె డిలీట్‌ చేసి అందరికి షాకిచ్చింది. ఇక ఆమె స్టోరిని చూసిన కొత్తమంది స్క్రీన్‌షాట్‌ తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.

కాగా వర్షిణి ఆ వ్యక్తి కనిపించకుండా జాగ్రత్త పడగా.. అతడి భుజంపై ఉన్న ఓం అనే టాటును చూసి అతడేవరా అని నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే దీనిపై ఆమె స్పందించకపోవడంతో వర్షిణి ప్రేమలో పడిందని, సీక్రెట్‌ డేటింగ్‌ చేస్తుందంటు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా 2017లో వర్షిణికి ఓ డైరెక్టర్‌తో నిశ్చితార్థమైన సంగతి తెలిసిందే. అది బ్రేక్‌ అయినట్లు వార్తలు వినిపించిన దానిపై ఇప్పటికి క్లారిటి లేదు. దీంతో ఈ వ్యక్తి ఆ డైరెక్టరేమోనని కూడా మరికొందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: 
వాణీ విశ్వ‌నాథ్ న‌ట వార‌సురాలు టాలీవుడ్ ఎంట్రీ 
త్వరలోనే త్రిష పెళ్లి.. వరుడు ఎవరంటే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు