చెక్‌ మేట్‌.. సూటిగా సొల్లు లేకుండా!

5 Apr, 2021 03:25 IST|Sakshi

సందీప్‌ బొలినేని, విష్ణుప్రియ, దీక్షా పంత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చెక్‌ మేట్‌’. ‘సూటిగా సొల్లు లేకుండా’ అన్నది ఉపశీర్షిక. చిన్నికృష్ణ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రసాద్‌ వేలంపల్లి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రసాద్‌ వేలంపల్లి  మాట్లాడుతూ– ‘‘కొత్త రకం ప్రేమకథగా రూపొందిన చిత్రం ‘చెక్‌ మేట్‌. మామూలుగా  ప్రతి ప్రేమకథలో వారి కుటుంబ సభ్యుల నుండి సమస్యలు వస్తాయి..

అయితే ఈ సినిమాలో తమ ప్రేమకు క్లోజ్‌ ఫ్రెండ్‌ వల్లే సమస్య ఏర్పడితే జరిగే పరిణామాలేంటి? స్నేహితురాలి నుండి తన ప్రేమికుడిని ఎలా కాపాడుకుని తన ప్రేమని గెలిపించుకుంది? అనేది కథాంశం. బలమైన పాత్ర కావడంతో తెలుగమ్మాయి చేస్తే బాగుంటుందని విష్ణు ప్రియని సెలక్ట్‌ చేశాం. తన ఫ్రెండ్‌గా దీక్షా పంత్‌ నటించారు’’ అన్నారు. బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, కృష్ణ భగవాన్, సంపూర్ణేష్‌ బాబు, షకలక శంకర్, సుధీర్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: అంజి (‘గరుడవేగ’ ఫేమ్‌), నేపథ్య సంగీతం: సాగర్‌ మహతి, సంగీతం–నిర్మాత–దర్శకత్వం: ప్రసాద్‌ వేలంపల్లి.  

మరిన్ని వార్తలు