‘సర్కారువారి పాట’ కు ఏపీ ప్రభుత్వం తీపి కబురు

8 May, 2022 11:46 IST|Sakshi

‘సర్కారువారి పాట’సినిమా యూనిట్‌కి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సినిమా టికెట్ల ధర పెంపుకు అనుమతి ఇచ్చింది. భారీ బడ్జెట్‌ సినిమా కావడంతో 10 రోజుల పాటు సాధారణ టికెట్ల రేటుపై రూ.45 అదనంగా వసూళ్లు చేసుకునే వెసులుబాటుని కలిపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజుల తర్వాత మళ్లీ పాత ధరలే కొనసాగుతాయి. టికెట్ల ధరను పెంచుకునే వెసులుబాటు కల్పించిన ఏపీ ‍ ప్రభుత్వానికి ‘సర్కారువారి పాట’ యూనిట్‌ కృతజ్ఞతలు తెలిపింది. 

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, కీర్తీ సురేష్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురాం​ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. మే 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు. 

(చదవండి: నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు.. మహేశ్‌బాబు ఎమోషనల్‌)

మరిన్ని వార్తలు