థియేటర్లు రీఓపెన్‌.. ఇక జోరు మామూలుగా ఉండదుగా..

5 Jul, 2021 19:41 IST|Sakshi

సినీ ప్రియులకు గుడ్‌న్యూస్‌. ఎప్పుడెప్పుడు థియేటర్లు ఓపెన్‌ అవుతాయా అని ఎదురుచూస్తున్న సినీ ప్రేక్షకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది.  జులై 8వ తేదీ నుంచి 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు నడిపించవచ్చని ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతేడాది కూడా కరోనా కారణంగా వేల కోట్ల నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసింది ఈ మాయదారి వైరస్‌. అయితే కేసులు తగ్గిపోతున్న తరుణంలో అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా థియేటర్లు తెరుచుకున్నాయి. అయితే అది కూడా మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది.

అలా థియేటర్లు ఓపెన్‌ అయిన రెండు, మూడు నెలలకే కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభించింది. దీంతో దాదాపు అన్ని రాషష్ష్ర్టాల్లో లాక్‌డౌన్‌ విధించక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కోవిడ్‌ తగ్గుముఖం పడుతుండటంతో థియేటర్ల అనుమతికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే వాయిదా పడిన సినిమా షూటింగులు కొద్ది రోజుల నుంచి జోరందుకున్న సంగతి తెలిసిందే.మరోవైపు తెలంగాణలో ఇప్పటికే థియేటర్లకు అనుమతిచ్చినా ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి అన్నదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే వందశాతం ఆక్యూపెన్సీతో త్వరలోనే థియేటర్ల అనుమతికి తెలంగాణ ప్రభత్వం పచ్చజెండా ఊపుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

మరిన్ని వార్తలు