సహజీవనం చేసి మోసాపోయా.. పెళ్లి తరువాత సంతోషంగా ఉన్నారా? 

21 Nov, 2022 08:30 IST|Sakshi

చెన్నై: కోలీవుడ్‌లో సంచలన నటిమణుల్లో ఆండ్రియా ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.  ఆమెపై ఇప్పటికే చాలా వదంతులు వచ్చాయి. గ్లామరస్‌గా నటించడానికి ఏ మాత్రం సంకోచించని బోల్ట్‌ అండ్‌ బ్యూటీ అండ్రియా. ఒకరిని నమ్మి సహజీవనం చేసి, చాలా మోసపోయానని ఆ మధ్య తనే స్వయంగా ఓ భేటీలో పేర్కొంది. శారీరకంగా మానసికంగానూ వేదనకు గురయ్యారని కూడా చెప్పుకొచ్చింది. అలా కొంతకాలం నటనకు దూరమైన ఈ ఆంగ్లో ఇండియన్‌ భామ ఆ తర్వాత మళ్లీ నటనపై దృష్టి సారిస్తూ వస్తోంది.

ప్రస్తుతం ఈమె రెండు లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి మి ష్కిన్‌ దర్శత్వంలో నటించిన పిశాచి 2, రెండోది అనల్‌ మేలే పని తులి. దర్శకుడు వెట్రిమారన్‌ నిర్మించిన ఈ చిత్రానికి కైసర్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఇది శుక్రవారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. పిశాచి 2 చిత్రం కూడా త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతుంది.

ఈ సందర్భంగా ఆండ్రియా ఒక భేటీలో ప్రేమ పెళ్లి అంశాలపై పేర్కొంటూ తను 20 ఏళ్ల వయసులోనే ఒక అతన్ని ఇష్టపడ్డానని తెలిపింది. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాననీ, అయితే ఆ ప్రేమ వర్కౌట్‌ కాలేదని చెప్పింది. ఆ తర్వాత ఎవరిని ప్రేమించలేదని చెప్పింది. నిజం చెప్పాలంటే పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది యువతులు సంతోషంగా లేరని చెప్పుకొచ్చింది. అలాగే పెళ్లికి దూరంగా చాలా మంది చాలా సంతోషంగా జీవిస్తున్నట్లు నటి ఆండ్రియా పేర్కొంది. తనకు ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, జీవితంలో ఆనందంగా గడపాలని తాను భావిస్తున్నట్లు చెప్పింది.  
చదవండి: ‘డేంజరస్‌’ .. ఆ అమ్మాయిలిద్దరూ ఎందుకు ప్రేమించుకున్నారు?

మరిన్ని వార్తలు