చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. యువ నటుడు హఠాన్మరణం

30 Jul, 2022 14:06 IST|Sakshi

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. మలయాళ యువ నటుడు శరత్ చంద్రన్(37) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం శరత్‌ కొచ్చిలోని తన నివాసంలో విగత జీవిగా కనిపించాడు. శరత్‌ హఠాన్మరణంతో మాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. దీంతో అతడి మృతికి సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

చదవండి: వారి కుక్కలకు కూడా స్పెషల్‌ రూం ఇస్తారు: జయసుధ షాకింగ్‌ కామెంట్స్‌

ప్రముఖ మాలీవుడ్ నటుడు ఆంటోనీ వర్గీస్ పెపే సోషల్‌ మీడియా వేదికగా శరత్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. కాగా శరత్ చంద్రన్.. ఒరు మెక్సికన్, సీఐఏ కామ్రేడ్ ఇన్ అమెరికా వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట ఐటీ సంస్థలో పనిచేసిన శరత్‌ డబ్బింగ్ ఆర్టిస్ట్‏గా కెరీర్‌ ప్రారంభించాడు. ఈ క్రమంలో అనిస్య సినిమాతో సినీ నటుడిగా అరంగేట్రం చేశాడు. లిజో జోస్ పెల్లిస్సేరి యాక్షన్ డ్రామా సినిమా అంగమలీ డైరీస్‌లో శరత్ కీలక పాత్ర పోషించాడు. 

మరిన్ని వార్తలు