Rishabh Pant: అంతా ఓకే.. మేము వారందరినీ నవ్వించాం: బాలీవుడ్‌ నటులు

31 Dec, 2022 15:26 IST|Sakshi

టీమిండియా యంగ్ క్రికెటర్‌ రిషబ్ పంత్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. క్రీడాకారులు, సినీ ప్రముఖులు సైతం రిషబ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పెద్దెఎత్తున ట్వీట్స్‌ చేశారు. ప్రధాని మోదీతో పలువురు రాజకీయ ప్రముఖులు ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా స్వస్థలం ఉత్తరాఖండ్‌కు ఢిల్లీ నుంచి వస్తుండగా.. రూర్కీ సమీపంలోని నర్సన్‌ సరిహద్దు వద్ద ఈ ప్రమాదం జరిగింది. 

(ఇది చదవండి: Rishabh Pant: క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌కు ఘోర ప్రమాదం.. తీవ్ర గాయాలు)

తాజాగా రిషబ్‌ పంత్‌ను బాలీవుడ్ నటులు పరామర్శించారు. డెహ్రడూన్‌లో ఆస్పత్రికి వెళ్లిన అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ క్రికెటర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. అయితే అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ రిషబ్‌ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 

అనిల్ కపూర్ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం పంత్ బాగానే ఉన్నాడు. అభిమానులుగా మేము అతనిని కలిశాం. రిషబ్ త్వరగా కోలుకోవాలని మనందరం ప్రార్థిద్దాం. అతని ఆటను మళ్లీ గ్రౌండ్‌లో చూస్తాం.' అని అన్నారు. అనుపమ్ ఖేర్‌ మాట్లాడుతూ.. 'పంత్‌ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు వచ్చాం. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. పంత్, అతని తల్లి, బంధువులను కలిసి మాట్లాడాం. అందరికీ ధైర్యంగా ఉండాలని చెప్పాం. మేము వారందరినీ నవ్వించాం.' అని అన్నారు.
 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు