Anil Kapoor: యంగ్‌గా ఉండాలని పాము రక్తం తాగుతారా?

15 Sep, 2021 17:24 IST|Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ సీనియర్‌ హీరో అనిల్‌ కపూర్‌ ఫిట్‌నెస్‌కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనందరికీ తెలిసిందే. 64 వయస్సులో కూడా కుర్రహీరోలు కుళ్లుకునేలా మజిల్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటారు. అయితే యంగ్‌గా కనిపించేందుకు పాము రక్తంగా తాగుతారన్న వ్యాఖ‍‍్యలకు తాజాగా స్పందించారు. ఇపుడిదే బీ టౌన్‌ టాపిక్‌గా మారిపోయింది.

ఫిట్‌గా కండలు తిరిగిన బాడీతో అనిల్ కపూర్‌ను చూసిన యువ హీరోలు వావ్‌ అంటారు. జెరోజ్ క్లూనీస్ లా హాట్‌గా ఉన్నాడనే కమెంట్లు చాలా సాధారణంగా వినిపిస్తుంటాయి.  ఈ మధ్య కాలంలో మరింత స్టయిలిష్‌గా అదరగొడుతున్నాడు.  (చదవండి :Ramya krishna: రమ్యకృష్ణకు హ్యాపీ బర్త్‌డే)

తాజాగా అర్బాజ్ ఖాన్  టాక్ షోలో అనిల్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. మీరు యవ్వనంగా ఉండటానికి పాము రక్తం తాగుతారటగా అని అర్బాజ్ ఖాన్ ప్రశ్నించాడు. అంతేకాదు ఏకంగా  ప్లాస్టిక్‌ సర్జన్‌ వెంటబెట్టుకని తిరుగుతారటగా అన్న నెటిజనుల కమెంట్లను చూపించాడు. దీంతో షాకైన అనిల్‌ కపూర్‌..ఇవి నిజమైన ప్రశ్నలేనా?  లేదంటే మీరే డబ్బులిచ్చి కల్పించారా అంటూ చమత్కరించారు.  పెద్దగా నవ్వేసి ఆయా కమెంట్లను కొట్టి పారేశారు. 

ఒక్క రోజుకి 24 గంటలు...ఇందులో ఒక గంట కూడా మనం మన శరీరం మీద శ్రద్ద పెట్టకపోతే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. తద్వారా వ్యాయామ అవసరాన్ని చెప్పకనే చెప్పారు.  అలాగే తనను అభిమానిస్తున్న ఫ్యాన్స్‌కు రుణపడి ఉంటానని  అనిల్‌ చెప్పుకొచ్చారు.
 

మరిన్ని వార్తలు