పెద్ద దర్శకులు చిన్న సినిమాలు కూడా తీయాలి

22 Feb, 2021 03:43 IST|Sakshi
అనిల్‌ రావిపూడి, ‘దిల్‌’ రాజు, ఎస్‌. కృష్ణ, అనీష్‌

– నిర్మాత ‘దిల్‌’ రాజు

‘‘దాసరి నారాయణరావుగారు, రాఘవేంద్రరావుగారు, కోడి రామకృష్ణగారు వంటి వారు పెద ్దసినిమాలతో పాటు చిన్న సినిమాలూ తీశారు. అందుకే వారు వంద సినిమాల మార్క్‌ను ఈజీగా దాటగలిగారు. పెద్ద దర్శకులు చిన్న సినిమాలు కూడా తీయాలి. పెద్ద డైరెక్టర్‌ యాడ్‌ అయితే చిన్న సినిమా పెద్ద సినిమా అవుతుంది. ‘గాలి సంపత్‌’ అలాంటి పెద్ద సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత ‘దిల్‌’ రాజు. శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్‌ హీరో హీరోయిన్లుగా రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో అనీష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాలి సంపత్‌’.

దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ, సమర్పణలో ఎస్‌. కృష్ణ, హరీష్‌ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన  ఈ  సినిమా మార్చి 11న విడుదల కానుంది. అనిల్‌æరావిపూడి మాట్లాడుతూ – ‘‘గాలి సంపత్‌ (రాజేంద్రప్రసాద్‌ పాత్ర) గొంతుకు ప్రమాదం జరిగి, మాట బయటకు రాదు. గాలి మాత్రమే వస్తుంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌గారిది చిలిపిగా మాట్లాడే ఫీ..ఫీ..ఫీ భాష’’ అన్నారు. ‘‘ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి ఎమోషన్స్‌ ఉన్నాయి’’ అన్నారు అనీష్‌. ‘‘చిన్న సినిమాగా మొదలైన ‘గాలిసంపత్‌’ అనిల్‌ రావిపూడి రాకతో పెద్ద సినిమాగా రిలీజ్‌ కాబోతోంది’’ అన్నారు సాహు గారపాటి, ఎస్‌. కృష్ణ.

మరిన్ని వార్తలు