‘క‌ళాకార్‌’ మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసిన అనిల్‌ రావిపూడి

14 Aug, 2021 21:00 IST|Sakshi

‘6 టీన్స్‌’ మూవీ హీరో రోహిత్ న‌టిస్తోన్న లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘క‌ళాకార్‌’. ఏజీ అండ్‌ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్నారు. శ్రీను బందెల దర్శ‌కుడు. ఇందులో షాయాజీ షిండే, పృథ్విరాజ్‌, రాజీవ్‌ కనకాల, శివశంకర్‌, రవికాలే, గగన్ వంటి ప్ర‌ముఖ న‌టులు కీలకపాత్రల్లో నటించారు. ఇటీవ‌ల హీరో శ్రీ‌కాంత్ చేతుల‌ మీదుగా విడుదలైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ‘క‌ళాకార్’ మూవీ మోష‌న్‌ పోస్ట‌ర్‌ను బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్‌రావిపూడి రిలీజ్‌చేసి చిత్ర‌ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

ఈ సినిమాలో రోహిత్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ మ‌హేంద్ర వ‌ర్మగా క‌నిపించ‌నున్న‌ట్లు మోష‌న్‌ పోస్ట‌ర్ ద్వారా రివీల్‌ చేశారు మేక‌ర్స్‌. క్రియేటివ్‌గా, స్టైలిష్‌గా ఉన్న ఈ మోష‌న్ పోస్ట‌ర్‌కు సోష‌ల్‌మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా.. హీరో రోహిత్ మాట్లాడుతూ .. ‘ఇటీవ‌ల విడుద‌ల చేసిన ‘క‌ళాకార్’ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. పోలీస్ ఆఫీస‌ర్‌గా చాలా ఫిట్‌గా ఉన్నావు అని నా ఫ్రెండ్స్‌, స‌న్నిహితులు ఫోన్ చేసి ప్ర‌సంశించారు. ఇప్పుడు మా మూవీ మోష‌న్‌పోస్ట‌ర్‌ను అనిల్ రావిపూడిగారు రిలీజ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. క‌చ్చితంగా ఈ సినిమా మీ అంద‌రికీ న‌చ్చుతుంది’ అన్నాడు. 

చిత్ర నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం మాట్లాడుతూ.. ‘మేము అడిగిన వెంట‌నే మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల‌ చేసిన అనిల్‌ రావిపూడిగారికి మా ఏజీ అండ్‌ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్ త‌ర‌పున ధ‌న్య‌వాదాలు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది’ అని పేర్కొన్నారు. ఇక దర్శకుడు శ్రీను బందెల మాట్లాడుతూ.. ‘ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ముగింపు ద‌శ‌లో ఉన్నాయి. త్వ‌ర‌లో టీజ‌ర్ విడుద‌ల‌చేస్తాం’ అని తెలిపారు. 

మరిన్ని వార్తలు