క్వారంటైన్‌లో మహేశ్‌ మాటలు బాగా పనిచేశాయి: డైరెక్టర్‌

21 May, 2021 19:11 IST|Sakshi

కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడ్డ యంగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కోలుకున్నారు. కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిన వెంటనే హోం ఐసోలేషన్‌కు వెళ్లిన ఆయన వైరస్‌ నుంచి పూర్తిగా బయటపడేవరకు తన ఆరోగ్యంపై ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ ద్వారా ఓ ఛానల్‌కు ఆయన ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన క్వారంటైన్‌ రోజులకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అనిల్‌ పంచుకున్నాడు.

అనిల్‌ మాట్లాడుతూ.. కరోనా వచ్చిందని దిగులు పడకుండా ఐసోలేషన్‌లో పుస్తకాలు చదువుతూ.. స్క్రిప్ట్‌పైకి తన మనసును మళ్లీంచేవాడినని చెప్పాడు. ఇక తాను తొందరగా కోలుకోవడానికి అవి మాత్రమే కాకుండా హీరో మహేశ్‌ బాబు మాటలు కూడా బాగా పనిచేశాయని తెలిపాడు. ‘కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలగానే హెం క్వారంటైన్‌కు వెళ్లిపోయాను. ఈ విషయం తెలిసి మహేశ్ బాబు ప్రతి మూడు, నాలుగు రోజులకు ఒకసారి ఫోన్‌ చేసేవారు. కేవలం నా ఆరోగ్యం గురించి కనుక్కోవడమే కాకుండా నాతో చాలా సేపు సరదాగా మాట్లాడేవారు. 

మధ్య మధ్యలో సినిమాటిక్‌ జోక్స్‌ కూడా వేసి బాగా నవ్వించారు. ఆయనకు కరోనా వచ్చినట్టుగా, ఆ వైరస్‌ ఎక్కడి నుంచి సోకిందనేది సినిమా కథలా వివరించేవారు. అది చాలా ఫన్నీగా అనిపించింది. ఆయన సరదా మాటలు నాపై బాగా పనిచేశాయి. ఆయనతో మాట్లాడినంత సేపు చాలా రిలాక్స్‌ ఫీల్‌ అయ్యేవాడిని’ అంటూ అని చెప్పుకొచ్చాడు. అంతేగాక హీరో దగ్గుబాటి వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ కూడా ఫొన్‌ చేసి తన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకునేవారని చెప్పాడు. అనిల్‌ ప్రస్తుతం వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌తో ‘ఎఫ్‌ 2’ సీక్వెల్‌ ‘ఎఫ్‌ 3’ మూవీని తెరకెక్కించే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ఆయన మహేశ్‌ బాబు, బాలకృష్ణతో కూడా సినిమా చేయనున్నట్టు సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు