‘యానిమల్‌’లో గీతాంజలిగా రష్మికా మందన్నా

24 Sep, 2023 06:07 IST|Sakshi

‘మీ గీతాంజలి’ అంటూ ‘యానిమల్‌’లో రష్మికా మందన్నా చేస్తున్న పాత్ర పేరు ప్రకటించి, శనివారం లుక్‌ని విడుదల చేసింది యూనిట్‌. రణ్‌బీర్‌ కపూర్, రష్మికా మందన్నా జంటగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యానిమల్‌’.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ చిత్రం టీజర్‌ ఈ 28న రిలీజ్‌ కానుంది. భూషణ్‌ కుమార్, క్రిషన్‌ కుమార్, ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్‌ 1న రిలీజ్‌ కానుంది.

మరిన్ని వార్తలు