ముద్దులిచ్చుకుంటూ నటి బర్త్‌డే వేడుకలు

14 Apr, 2021 19:56 IST|Sakshi

నువ్వు నేను, శ్రీరామ్‌, నేనున్నాను.. వంటి చిత్రాల్లో నటించిన అనితా హసానందాని పెళ్లి తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడ పలు హిందీ చిత్రాల్లో నటించిన ఆమె బుల్లితెర మీద కూడా తళుక్కున మెరిసింది. నేడు ఆమె బర్త్‌డే. దీంతో భార్య పుట్టినరోజును ఘనంగా జరపాలనుకున్నాడు రోహిత్‌ రెడ్డి. కానీ ముంబైలో లాక్‌డౌన్‌ ఉండటంతో ఇంట్లోనే ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకలు జరిపాడు. ఈమేరకు ఓ వీడియోను అనిత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఇందులో బెలూన్లు ఎగరేస్తూ కేక్‌ ముందు కూర్చున్న అనితకు ప్రేమకు చిహ్నంగా పుష్పగుచ్చాలను అందించాడు ఆమె భర్త రోహిత్‌. ఇద్దరూ ఒకరొకరు ఆప్యాయంగా ముద్దులిచ్చుకుంటూ మురిపిస్తున్న ఈ వీడియో అభిమానులకు తెగ నచ్చింది. ఈ లాక్‌డౌన్‌ బర్త్‌డే భలే బాగుంది అంటూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. 

కాగా అనిత, రోహిత్‌ 2013లో పెళ్లి చేసుకున్నారు. వీరు వైవాహిక బంధంలో అడుగుపెట్టిన ఏడేళ్ల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 9న తొలి సంతానానికి జన్మనిచ్చారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం వారి కుటుంబంలోకి కొత్త అతిథి రావడంతో ఈ దంపతులు ఆనందంలో తేలియాడుతున్నారు.

A post shared by Anita H Reddy (@anitahassanandani)

చదవండి: నా కొడుకుతో సహా బిగ్‌బాస్‌కు వెళ్తా!: నటి

ఎన్టీఆర్‌ 30: హీరోయిన్‌గా ముంబై బ్యూటీ!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు