Anita Hassanandani Reddy: ' నా జీవితంలో దారులన్నీ ముసుకుపోయాయి'.. అనిత ఎమోషనల్ పోస్ట్!

27 Sep, 2023 15:01 IST|Sakshi

టాలీవుడ్‌లో నువ్వు నేను సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న హీరోయిన్ అనిత. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించారు. ఆ తర్వాత తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా కనిపించింది. తొట్టిగ్యాంగ్, నేను పెళ్లికి రెడీ, ముసలోడికి దసరా పండుగ లాంటి సినిమాల్లో నటించింది. 2003లో  కుచ్ తో హై సినిమా ద్వారా బాలీవుడ్‌లోనూ ప్రవేశించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో నటించిన అనిత.. పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైంది. 

(ఇది చదవండి:  Bigg Boss 7: పల్లవి ప్రశాంత్‌ తలకు గాయం.. కుప్పకూలిపోయిన రైతు బిడ్డ!)

అయితే సినిమాలకు దూరమైనప్పటికీ బుల్లితెరపై సందడి చేసింది. హిందీ సీరియల్స్, టీవీ షోలతో బీ టౌన్ ఆడియన్స్ మనసు దోచుకుంది. అంతే కాకుండా యాడ్స్‌లోనూ నటిస్తూ అభిమానులను అలరించింది.  2014లో వ్యాపారవేత్త రోహిత్‌ పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా అనిత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. అదేంటో ఓ లుక్కేద్దాం. 

అనిత తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఈ రోజు నేను చేసింది కేవలం ఒక పోస్ట్ మాత్రమే కాదు. నా కోసం, నేను చేసిన అద్భుతమైన ప్రయాణానికి గుర్తు ఇది. నాకు ఆ టీనేజ్ రోజులు ఇంకా గుర్తున్నాయి. అప్పుడు నా జీవితం ఎన్నో కలలు, గందరగోళాల మధ్య సుడిగుండంలా గడిచింది. ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయిగా కేవలం ఒక డైరీలో నా ఆశలు గురించి రాసుకున్నా.  కానీ నా జీవితంలో అప్పుడే ఓ విషాదం జరిగింది. నేను నా తండ్రి.. నా హీరోని కోల్పోయాను. ఆ సమయంలో నా దారులన్నీ మూసుకుపోయాయి. కానీ నేను వాటికి భయపడలేదు. కేవలం నా కోసమే కాదు.. నా కుటుంబానికి వెన్నెముకగా మారాను. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నా. నా కుటుంబంతో గర్వంగా.. ఓ తల్లిగా, ప్రేమగల భర్త, నా బిడ్డే ఇప్పుడు నా ప్రపంచం. నా లైఫ్‌లో ప్రతిరోజును ఆస్వాదిస్తున్నా. అందుకే ఈ రోజు నుంచి నాకు నేనే కృతజ్ఞతలు చెప్పడానికి కొంత సమయం కేటాయించాలనుకుంటున్నా. నా లైఫ్‌ ఇంత హ్యాపీగా మారినందుకు నాకు నేనే రుణపడి ఉంటాను.' అంటూ పోస్ట్ చేసింది. తన జీవితంలో ఎన్నో బాధలు అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నందుకు ఆనందంగా ఉందంటూ అనిత ఎమోషనలయ్యారు. 

(ఇది చదవండి: ఆస్కార్ బరిలో చిన్న సినిమా.. అవార్డ్ దక్కేనా?)

A post shared by Anita H Reddy (@anitahassanandani)

మరిన్ని వార్తలు