అందరికంటే ఎక్కువగా ఏడిపించే వ్యక్తి నువ్వే, అందుకే: నటి

1 Jul, 2021 19:47 IST|Sakshi

‘నువ్వు నేను’ హీరోయిన్‌, నటి  అనిత హసానందాని తరచూ తనకు సంబంధించిన విషయాలను, భర్త రోహిత్‌ రెడ్డిని సరదాగా ఆటపట్టించే వీడియోలు, తన ముద్దుల తనయుడి ఫొటోలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి తన భర్తను ఆటపట్టిస్తూ అనిత షేర్‌ చేసిన ఓ పోస్టు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

ఈ క్రమంలో అనిత తన భర్తతో క్లోజ్‌గా తీసుకున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఈ ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా నన్ను ఏడిపించేది నువ్వే. అందుకే  నీకు చిరాకు తెప్పించే ప్రతి మూమెంట్‌లో నేను నీతో ఉండాలనుకుంటాను’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను జత చేసింది. కాగా బిజినెస్‌మేన్‌ రోహిత్‌రెడ్డిని ప్రేమించిన అనిత 2013లో అతడిని వివాహం చేసుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టింది. ఇటీవల ఈ జంట పండంటి మగబిడ్డకు జన్మించిన సంగతి తెలిసిందే. 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

మరిన్ని వార్తలు