హాట్‌స్టార్‌లో అంజలి 'ఝాన్సీ' వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌

28 Oct, 2022 09:52 IST|Sakshi

తమిళసినిమా: నటి అంజలి కూడా వెబ్‌సిరీస్‌ ప్రపంచంలోకి చేరిపోయింది. ఈమె టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ఝాన్సీ వెబ్‌సిరీస్‌ తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌ను ట్రైబల్‌ హార్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నటుడు కృష్ణ నిర్మించారు. గణేష్‌ కార్తీక్‌ కథ, కథనాన్ని రూపొందించగా తిరు దర్శకత్వం వహించారు. ఒక సంఘటనలో గతాన్ని మరచిపోయిన యువతి తనెవరో, తన గతం ఏమిటో తెలియకుండా జీవిస్తుంది.

ఆమెకు ఒక డాక్టర్‌ గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఆమెకు గతం గుర్తుకొచ్చిందా? ఆ తరువాత ఏం చేసిందన్న ఆసక్తికరమైన అంశాలతో కూడిన వెబ్‌ సిరీస్‌ ఝాన్సీ. ఇది గురువారం నుంచి డిస్నీహాట్‌ స్టార్‌లో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది తాను నటించిన చిత్రం ఏదీ విడుదల కాలేదని త్వరలో బెల్బాటం చిత్రం విడుదలకు సిద్ధమవుతుందని చెప్పారు. అయితే తనకు నిర్మాత కావాలన్నది చిరకాల కల అని చెప్పారు.

ఇది తమ సంస్థలో రూపొందించిన మూడో వెబ్‌సిరీస్‌ అని తెలిపారు. దీనికి తిరువూరు బొక్క ఎపిసోడ్‌ కన్నా దర్శకత్వం వహించమని కోరగా ఆయన వెంటనే అంగీకరించారని చెప్పారు. ఝాన్సీ వెబ్‌ సిరీస్‌ చాలా బాగా వచ్చిందని, అయితే తాను ఇందులో నటించలేదని చెప్పారు. ఈ వెబ్‌సిరీస్‌కి సహకరించిన డిస్నీ హాట్‌ స్టార్‌ సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని నిర్మాత తెలిపారు.

మరిన్ని వార్తలు