Anjali : అంజలి నటించిన 'ఫాల్‌' వెబ్‌సిరీస్‌ ఇప్పుడు హాట్‌స్టార్‌లో..

10 Dec, 2022 10:15 IST|Sakshi

తమిళసినిమా: నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ఫాల్‌. ఎస్‌పీబీ చరణ్, నటి సోనియాఅగర్వాల్, సంతోష్‌ ప్రతాప్, నమిత కృష్ణమూర్తి, పూర్ణిమా భాగ్యరాజ్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ వెబ్‌ సీరీస్‌ను డిస్నీ హాట్‌స్టార్‌ సంస్థ నిర్మించింది. దీని ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు సిద్ధార్థ్‌ రామస్వామి దర్శకుడుగా పరిచయమయ్యారు. ఈ వెబ్‌ సిరీస్‌ శుక్రవారం నుంచి డిస్నీ హాట్‌స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. గురువారం రాత్రి చెన్నైలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో డిస్నీ హాట్‌స్టార్‌ సంస్థ నిర్వాహకులు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న నటి అంజలి మాట్లాడుతూ తాను ఇందులో దివ్య అనే పాత్రలో నటించానని చెప్పారు.

ఇది రొటీన్‌ పాత్రలకు భిన్నంగా, కాస్త చాలెంజింగ్‌గా ఉంటుందన్నారు. థ్రిల్లర్‌ కథా చిత్రాలను ఇష్టపడే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుందన్నారు. ఇందులో నటించిన నటినటీలందరికీ ప్రాముఖ్యత ఉంటుందన్నారు. పూరి్ణమా భాగ్యరాజ్‌తో కలిసి నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు. ఆమె మంచి కథలను చెప్పేవారని, తన లవ్‌స్టోరీ కూడా దాచుకోకుండా చెప్పారన్నారు. డిస్నీ హాట్‌స్టార్‌ సంస్థలో తాను నటించిన రెండవ వెబ్‌ సిరీస్‌ ఇది అని చెప్పారు.

చాలా కంఫర్టబుల్‌గా చూసుకునే సంస్థ ఇది అని తెలిపారు. దర్శకుడు సిద్ధార్థ రామస్వామి గురించి చెప్పాలంటే ఆయన చాలా కూల్‌ పర్సన్‌ అని పేర్కొన్నారు. తనే చాయాగ్రాహకుడు కావడంతో సన్నివేశాల చిత్రీకరణలో చాలా పర్ఫెక్ట్‌గా ఉండేవారన్నారు. టెక్నికల్‌గా కూడా తమకు నటించడం చాలా ఈజీ అయ్యిందన్నారు. వన్‌ మోర్‌ టేక్‌ అన్నదే చేసేవారు కాదని చెప్పారు. ఆయన దర్శకత్వంలో పనిచేయడం మంచి అనుభవంగా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు