వృద్ధ నటుడితో పెళ్లి? అప్పుడేం చేశావ్‌?

10 Jun, 2021 14:26 IST|Sakshi

ఐదు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఫిట్‌గా ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు బాలీవుడ్‌ నటుడు మిలింద్‌ సోమన్‌. అంతేకాదు, తనకన్నా 26 ఏళ్లు చిన్నదైన అంకిత కొన్వర్‌ను వివాహం చేసుకుని గతంలో వార్తల్లో నిలిచాడు. తాజాగా ఇదే విషయం గురించి ఓ నెటిజన్‌ అంకితను సూటిగా ప్రశ్నించాడు. వృద్ధుడిని పెళ్లి చేసుకోకూడదు అన్న భారతీయుల మూస ఆలోచనా ధోరణిని ఎలా ఎదుర్కొన్నారు? అని అడిగాడు.

దీనికి అంకిత బదులిస్తూ.. "సమాజంలో జరిగే అసాధారణ విషయాల గురించి మాట్లాడేందుకు ప్రజలు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. అది ఒక్క భారత్‌లోనే కాదు అంతటా ఉంది. అయితే మనందరిలో నైపుణ్యాలు ఉంటాయి. కానీ దానివల్ల మంచి, చెడుకు మధ్య వ్యత్యాసం తెలుసుకోగలిగేంత స్పృహ లేదు. నేను మాత్రం నాకెప్పుడూ సంతోషాన్నిచ్చే పనులే చేశాను" అని చెప్పుకొచ్చింది.

కాగా మిలింద్‌ పరిచయమవడానికి ముందు అంకితకు ఓ బాయ్‌ఫ్రెండ్‌ ఉండేవాడు. అతడు సడన్‌గా మరణించడంతో ఆమె ఎంతో కుంగిపోయింది. అదే సమయంలో ఆమె ఉద్యోగరీత్యా చెన్నైకి రావాల్సి వచ్చింది. అక్కడ ఓ హోటల్‌లో బస చేస్తున్న సమయంలో అంకిత మిలింద్‌ను చూసింది. అప్పటికే మిలింద్‌కు అంకిత పెద్ద ఫ్యాన్‌. కానీ హాయ్‌ చెప్పడానికి వెళ్లిన ఆమెను బిజీగా ఉన్న మిలింద్‌ సరిగా పట్టించుకోలేదు. కొద్ది రోజుల తర్వాత అతడు మళ్లీ అదే హోటల్‌కు వచ్చాడు. అప్పుడు ఇద్దరి చూపులు కలిశాయి.

ఫ్రెండ్స్‌ ఎంకరేజ్‌మెంట్‌తో అతడితో కలిసి డ్యాన్స్‌ చేసింది అంకిత. అలా వారి ప్రేమ మొదలైంది. ఒకరోజు అంకిత తన గతాన్నంతా మిలింద్‌కు చెప్పింది. 'ఏ క్షణమైతే నీతో ప్రేమలో పడ్డానో, అప్పుడే నీకు సంబంధించిన ఏ విషయాన్నైనా స్వాగతిస్తాను అని ఫిక్సయ్యా. నీ గత జ్ఞాపకాల భారాన్ని నేనూ మోస్తాను. మనం కలిసే ఉందాం' అని ఆమె చేయి పెట్టుకున్నాడు. అలా 2018లో వీరి వివాహం జరిగింది. అప్పుడు మిలింద్‌ వయసు 52 కాగా అంకిత వయసు 26 ఏళ్లు మాత్రమే. ప్రేమకు వయసు అక్కర్లేదని మనసులు కలిస్తే చాలని పెళ్లి చేసుకుని నిరూపించారు మిలింద్‌, అంకిత.

చదవండి: సెల్ఫీ అడిగిన మహిళతో పుషప్‌లు.. నటుడిపై నెటిజన్లు ఫైర్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు