Ankita Lokhande: ఇట్స్‌ టూ మచ్‌, అంత మేకప్‌ అక్కర్లేదు.. నటిపై ట్రోలింగ్‌

6 May, 2022 18:00 IST|Sakshi

తెరపై తళుకులీనే తారలు మేకప్‌ వేసుకోవడం సర్వసాధారణం. కెమెరా ముందు మాత్రమే కాదు ఏదైనా పార్టీలు, ఫంక్షన్స్‌ ఉన్నా సరే మేకప్‌ వేసుకున్నాకే అడుగు బయటపెడ్తుంటారు. కానీ సరిగా మేకప్‌ వేసుకోకపోయినా, దాని డోస్‌ ఎక్కువైనా సరే ప్రేక్షకులు అస్సలు సహించరు. మేకప్‌ ఎలా వేసుకోవాలో కూడా మేమే నేర్పాలా? అని చిందులు తొక్కుతారు. తాజాగా బాలీవుడ్‌ నటి అంకిత లోఖండేకు కూడా ఇలానే క్లాస్‌ పీకుతున్నారు నెటిజన్లు. 

అంకిత- విక్కీ జైన్‌ దంపతులు ఇటీవల రాహుల్‌ మహాజన్‌ భార్య నటల్య బర్త్‌డే పార్టీకి హాజరయ్యారు. ఈ నూతన దంపతులు బ్లాక్‌ డ్రెస్‌లో పార్టీలో తళుక్కుమని మెరిశారు. ఈ వేడుకలో తను ఎలా రెడీ అయిందో తెలుపుతూ మచ్చుకు కొన్ని ఫొటోలు వదిలింది అంకిత. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. 'నువ్వు ధరించిన డ్రెస్సుకు, వేసుకున్న మేకప్‌కు సంబంధమే లేదు, 'మరీ అంత మేకపా? నువ్వు సహజంగానే బాగుంటావు, కాస్త టచప్‌ మాత్రమే సరిపోతుంది, కానీ ఇలా ఓవర్‌ మేకప్‌ అస్సలు బాగోలేదు', 'చాలా, ఇంకాస్త రుద్దుకోకపోయావా?' అంటూ తిట్టిపోస్తున్నారు. కానీ ఆమె అభిమానులు మాత్రం అంకిత లుక్‌ను చూసి దీపికా పదుకోణ్‌, కెండల్‌ జెన్నర్‌తో పోల్చుతూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

A post shared by Ankita Lokhande Jain (@lokhandeankita)

A post shared by 💥CASHMAKEUPARTISTRY 💥 (@cashmakeupartistry)

చదవండి: కీర్తి సురేష్ 'చిన్ని' సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే?

మరిన్ని వార్తలు