Ankita Lokhande: బిగ్‌బాస్‌ ఎంట్రీపై అంకిత రెస్పాండ్‌

28 Jun, 2021 10:53 IST|Sakshi

ఒక్కసారైనా బిగ్‌బాస్‌కు వెళ్లాలని చాలామంది కలలు కంటుంటారు.. కానీ బిగ్‌బాస్‌కు వెళ్లిన కొద్దిమంది మాత్రం దాన్నో పీడకలగా అభివర్ణిస్తారు. ఎందుకంటే.. ఈ రియాలిటీ షో కొందరికి ప్రత్యేక గుర్తింపుతో పాటు పాపులారిటీని తెచ్చిపెడితే మరికొందరికి మాత్రం అప్రతిష్టను మూటగడుతుంది. అందుకే ఈ షో నుంచి పిలుపు వచ్చినా అందులో అడుగు పెట్టాలంటేనే వెనకడుగు వేస్తుంటారు కొందరు సెలబ్రిటీలు. దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ మాజీ ప్రేయసి, నటి అంకిత లోఖండే కూడా ఇదే కోవలోకి చెందుతుంది.

తను హిందీ బిగ్‌బాస్‌ షోలోకి ఎంట్రీ ఇవ్వనుందంటూ గత కొంతకాలంగా ప్రచారం ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ రూమర్లు అంకిత వరకూ చేరాయి. దీంతో ఈ ఊహాగానాలకు చెక్‌ పెడుతూ తాను బిగ్‌బాస్‌కు వెళ్లడం లేదని తేల్చిపారేసింది. "ఈ ఏడాది నేను బిగ్‌బాస్‌ షోలో పార్టిసిపేట్‌ చేస్తున్నట్లు వచ్చిన వార్తలు చదివాను. కానీ అవి నిరాధారం. నేను ఆ షోలో భాగం కావడం లేదు. నేను బిగ్‌బాస్‌ షోలో భాగం కానప్పటికీ ప్రజలు నన్ను ద్వేషించడంలో మాత్రం ముందున్నారు" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

చదవండి: Sushant Singh: ఆ నవ్వులు చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయి

మరిన్ని వార్తలు