ఏడాది కూడా ఆగలేకపోయావా అంకితా!

30 Mar, 2021 15:31 IST|Sakshi

దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ ప్రియురాలు అంకిత లోఖండేకు సోషల్‌ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. తన ప్రస్తుత బాయ్‌ఫ్రెండ్‌ విక్కీ జైన్‌తో కలిసి హోలీ పండగ వేడుకను సెలబ్రెట్‌ చేసుకున్న వీడియోను అంకిత సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అది చూసి సుశాంత్‌ అభిమానులు, నెటిజన్లు ఆమెపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాయ్‌ఫ్రెండ్‌తో‌ ఆనందంగా చిందులేస్తూ హోలీ పండగను జరుపుకోవడమే కాక ఆ వీడియోను షేర్‌ చేస్తావా అంటూ నెటిజన్లు మండిపడుతూ తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇందులో అంకిత ఆమె బాయ్‌ఫ్రెండ్‌ విక్కిలు సంతోషంతో ఊగిపోతూ ఒకరికొకరు రంగులు అద్దుకుంటూ.. డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. దీనిని అంకిత ‘అందరికి హోలీ శుభాకాంక్షలు’ అంటూ షేర్‌ చేసింది. ఇక దీనిపై సుశాంత్‌ ఫ్యాన్స్‌ స్పందిస్తూ.. ‘ఛీఛీ సిగ్గుచేటు సుశాంత్‌ చనిపోయి ఏడాది కూడా కాలేదు హోలీ ఎలా సెలబ్రెట్‌ చేసుకుంటున్నావ్‌ అంకిత’, ‘సుశాంత్‌ అభిమానులుగా మేమే హోలీ పండగ సెలబ్రేట్‌ చేసుకోలేకపోయాం.. కానీ నువ్వు ఆయన ప్రియురాలివి..ఒక్క ఏడాది కూడా అగలేకపోయావా అంకిత’,

‘సుశాంత్‌ విషయంలో అంకిత చెప్పినవన్ని అబద్ధాలే.. ఫేం కోసం సుశాంత్‌ ప్రియురాలినని చెప్పుకుంది. పెద్ద మహానటి’, ‘హేట్‌ యూ అంకిత’ అంటూ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. కాగా అంకిత సుశాంత్‌ మరణాంతరం తనిన ప్రేమించానని, ఏడాది వారకు తామిద్దరం డేటింగ్‌లో ఉన్నామంటు అవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక సుశాంత్‌ను పెళ్లి చేసుకోవడం కోసం తనకు వచ్చి మూవీ ఆఫర్స్‌ను తిరస్కరించానని, షారుక్‌ ఖాన్‌తో‌ ‘హ్యాపీ న్యూయర్’‌, ‘రామ్‌-లీలా’ వంటి సూపర్‌ హిట్‌ మూవీస్‌ కూడా వదులుకున్నట్లు ఆమె ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది.

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

చదవండి: 
చాన్స్‌ కోసం నిర్మాత గదిలోకి వెళ్లమన్నారు: నటి‌ 
‘మేం విడిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు?’

మరిన్ని వార్తలు