Jaan Say: లవర్‌ బాయ్‌ ప్రణయ్‌గా అంకిత్‌.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్‌

25 Dec, 2022 16:15 IST|Sakshi

అంకిత్, తన్వి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘జాన్‌సే...’. క్రితి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  ఎస్.  కిరణ్ కుమార్ కథ,  స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. 'జాన్ సే...' టైటిల్ లో ఉన్న మూడు డాట్స్ సినిమాలో కీలకమైన ముగ్గురి పాత్రలను ప్రతిబింబిస్తున్నాయి. అందులో మొదటి డాట్, పాత్రను క్రిస్మస్ పర్వదినాన టీం పరిచయం చేశారు.

హీరో అంకిత్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ప్రణయ్ పాత్రలో కనిపించే అంకిత్ ఈ చిత్రంలో లవర్ బాయ్ పాత్రలో కనిపిస్తారు. ఉత్కంఠ రేపే థ్రిల్లింగ్ అంశాలతో జాన్ సే... ఆద్యంతం ప్రేక్షకులను అలరించేలా సాగుతుంది. ఈ చిత్రం తప్పకుండా థియేటర్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు కిరణ్ కుమార్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్‌ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. వచ్చే ఏడాది  సమ్మర్ స్పెషల్ గా అయిదు భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. 

>
మరిన్ని వార్తలు