స్టార్‌ హీరోకి చెల్లిగా కీర్తి సురేశ్‌.. అందుకే ఒప్పుకుందట!

25 May, 2021 13:30 IST|Sakshi

Keerthy Suresh: ‘మహానటి’ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కీర్తి సురేష్ ఇమేజ్ ఎంతగా పెరిగి పోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో వరుస ఆఫర్లు వచ్చాయి. అయితే ఈ బ్యూటీ మాత్రం వచ్చిన ప్రతి సినిమాను ఒప్పుకోకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేసుకుంటూ కెరీర్‌లో దూసుకెళ్తోంది. 

ఇదిలా ఉంటే స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న కీర్తి..  మరోసారి డేరింగ్‌ స్టెప్‌ వేసింది. సూపర్‌ స్టార్‌ సినిమాలో సోదరి పాత్రకు ఓకే చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్‌ హీరోగా శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా “అన్నాతే”.ఈ సినిమాలో కీర్తి సురేష్ రజినీకాంత్ ముద్దుల చెల్లెలిగా ఓ కీలక పాత్రలో నటించారు. ఇటీవల తన షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసుకుంది. సినిమాను మొత్తం టర్న్‌ చేసే కీ రోల్ కావడంతోనే కీర్తి ఈ పాత్ర చేయడానికి ఓకే చెప్పిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో సూపర్ స్టార్ మహేశ్‌ బాబు నటిస్తున్న ‘సర్కారువారి’ పాట సినిమాలో నటిస్తుంది.
చదవండి:
ఓటీటీలో విడుదలపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌
NTR 31: ప్రశాంత్‌ నీల్‌ రెమ్యునరేషన్‌ ఎంతంటే..

మరిన్ని వార్తలు