అన్నపూర్ణమ్మగారి మనవడు రెడీ

24 Oct, 2020 05:22 IST|Sakshi
సుధ, రవితేజ, అన్నపూర్ణమ్మ, జమున

సీనియర్‌ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్‌ రవితేజ లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. మరో సీనియర్‌ నటి జమున ప్రధాన పాత్రలో నటించగా బాలాదిత్య, అర్చన జంటగా నటించారు. జాతీయ అవార్డుగ్రహీత నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వం వహించారు. ఎం.ఎన్‌.ఆర్‌. ఫిలిమ్స్‌ పతాకంపై ఎం.ఎన్‌.ఆర్‌. చౌదరి నిర్మించిన ఈ సినిమా ఆదివారం (అక్టోబర్‌ 25న) ఓవర్‌సీస్‌లో విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివనాగు మాట్లాడుతూ– ‘‘తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఓ చిన్న సినిమా ఒకేసారి ఓవర్సీస్‌లో విడుదల కానుండటం ఇదే మొదటిసారి. అమేజాన్‌ ప్రైమ్‌లో విడుదలవుతున్న మా సినిమాని ఇండియాలో మాత్రం థియేటర్లు ప్రారంభించాక విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మంచి అభిరుచిగల దర్శకుడు శివనాగు ఈ చిత్రాన్ని ఎంతో బాగా మలిచారు. పాటలు చాలా బావున్నాయి’’ అని అతిథిగా విచ్చేసిన సంగీత దర్శకుడు కోటి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌ కిరణ్, కెమెరా: గిరికుమార్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు