Nandini Reddy: అన్నీ మంచి శకునములే సినిమాకు ఆయనే సూపర్‌ స్టార్‌..

17 May, 2023 19:23 IST|Sakshi

సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్  'అన్నీ మంచి శకునములే'. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమా నిర్మాణంలో మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ నిర్మించారు. మే 18న విడుదలవుతున్న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా దర్శకురాలు నందిని రెడ్డి తాజా ఇంటర్వ్యూలో  పలు విషయాలు తెలియజేశారు. అవి ఆమె మాటల్లోనే..

సంతోష్‌, మాళవికతో పాటు మిగిలిన పాత్రలకూ ప్రాధాన్యత ఉన్న కథ ఇది. విక్టోరియా పురం అనే ఊరి కథ. ఆ ఊరికి ఈ పాత్రలకు సంబంధం ఏమిటి? లవ్‌ స్టోరీకి ఏమిటి సంబంధం? ఇలా అన్ని లింక్‌తో ఉంటాయి. అసలు ఇలాంటి కథకు చాలా పాత్రలు ఉండడం వారికి తగిన న్యాయం చేయడం అనేదే గొప్ప ఛాలెంజ్‌.

ఆంధ్ర, తమిళనాడు బోర్డర్‌ లో ఉన్నదే విక్టోరియా పురం. కాఫీ తోటలకు ప్రసిద్ధి. అక్కడ చెఫ్‌ పెట్టే కాఫీని రాణి చాలా ఇష్టంగా తాగుతారు. అలా ఆ ఊరు ఫేమస్‌ అయింది. కాఫీ ఎస్టేట్‌, రెండు కుటుంబాలు, నాలుగు జనరేషన్స్‌, కోర్టు కేసు ఇలా అన్ని అంశాలతో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుంది.

ఇప్పటివరకు చేసిన సినిమాల్లో బెస్ట్‌ క్లైమాక్స్‌ ఈ సినిమాకు రాశాను అనుకుంటున్నా. చివరి 20 నిమిషాలపై నా కెరీర్‌ ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే 30 మందికిపైగా బయటివారు, సెన్సార్‌ వారూ చూశాక ది బెస్ట్‌ అన్నారు. మీరు సినిమా చూశాక హీరో పాత్రను ప్రేమిస్తారు.

రచయిత లక్ష్మీ భూపాల్‌ నా బ్రదర్‌ లాంటివాడు. ఎమోషనల్‌ సీన్స్‌ బాగా రాయగలడు. నా సినిమాకు భూపాల్‌ ప్రేమతో రాస్తాడు. కథ చర్చించుకున్నప్పుడు అంచనా వేయగలడు. అంత ముందు చూపు ఉంది తనకి.

విక్టోరియాపురం ఐడియా రైటర్‌ షేక్‌ దావూద్‌ది. కథ అనుకున్నప్పుడు ప్రేక్షకులకు కొత్త ప్రపంచం చూపించాలని క్రియేట్‌ చేశాడు. అలా వచ్చిన కథే ఇది. విక్టోరియాపురం ప్యాలెస్‌ కునూర్‌ లో షూట్‌ చేశాం.

ఈ సినిమాకు సంగీత దర్శకుడు మిక్కీనే సోల్‌. ఈ కథ చెప్పినప్పుడు నువ్వే సూపర్‌ స్టార్‌ అని చెప్పాను. క్లైమాక్స్‌ రాసేటప్పుడు ఆ ఫీల్‌ కు అనుగుణంగా నేపథ్య సంగీతం ఇచ్చాడు. ఇందులో చివరిలో పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు. కానీ భూపాల్‌ నాలుగు పేజీల డైలాగ్స్‌ రాశాడు. కథ డిమాండ్‌ మేరకు ఉంచాం.

నా నెక్స్ట్‌ మూవీలో హీరోగా సిద్దు ఫిక్స్‌. సమంత అనుకోలేదు.

నాకు స్క్రిప్ట్ ను పూరీ గారిలా స్పీడ్‌ గా రాయడం కుదరదు. సోలో రచయితగా రాస్తున్నప్పుడు టైం పడుతుంది. అందుకే ఇప్పుడే రచయితల టీమ్‌ను పెట్టుకున్నాను. ఈ సినిమాకు నాకు మంచి స్లాట్ దొరికింది. నాకు పెద్దగా గ్యాప్‌ అనిపించలేదు. ఎందుకంటే ఆ గ్యాప్‌లో కథలు రాసుకున్నా.

ఏ సినిమాకూ మార్నింగ్‌ షోకు ప్రేక్షకులు రావడంలేదు. నా మొదటి సినిమా అలా మొదలైంది నుంచి ఓ బేబీ వరకు మార్నింగ్‌ షోకు పెద్దగా ప్రేక్షకులు లేరు. తర్వాత మౌత్‌ టాక్‌ తో విపరీతంగా వచ్చి చూశారు.

నా నెక్ట్స్‌ చిత్రం ఊహించని కథతో రాబోతున్నా. వినూత్నంగా ఉంటుంది.

చదవండి: మరోసారి ఆస్పత్రిపాలైన రోహిణి. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ కంటతడి

మరిన్ని వార్తలు