'ఆడియన్స్‌ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది': మిక్కీ జే మేయర్

17 May, 2023 00:18 IST|Sakshi

మిక్కీ జే మేయర్‌ 

‘‘నా మ్యూజిక్‌ కంపోజర్స్‌ టీమ్‌ అందరూ అమెరికా, లండన్‌లో ఉంటారు. సో.. నేను అమెరికాలో ఉన్నప్పటికీ నిర్మాతలు ఇబ్బందిపడటంలేదు. ఓ సినిమా హిట్‌ అయితే హీరో, డైరెక్టర్స్‌తో పాటు సంగీత దర్శకుడికి మంచి పేరు వస్తుంది. అందుకే స్క్రిప్ట్‌ ముఖ్యమని నమ్ముతాను. ఇక ఇటు శేఖర్‌ కమ్ములగారి నుంచి హరీష్‌ శంకర్, అటు నాగ్‌ అశ్విన్‌ నుంచి నందినీ రెడ్డిగార్ల సినిమాలు.. ఇలా డిఫరెంట్‌ సినిమాలకు మ్యూజిక్‌ అందించిన అతి కొద్దిమంది మ్యూజిక్‌ డైరెక్టర్స్‌లో నేనూ ఒకణ్ణి’’ అన్నారు సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్‌.

సంతోష్‌ శోభన్, మాళవికా నాయర్‌ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్రవిందా మూవీస్, స్వప్నా సినిమాస్‌ పతాకాలపై ప్రియాంకా దత్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర సంగీతదర్శకుడు మిక్కీ జే మేయర్‌ మాట్లాడుతూ– ‘‘మహానటి’ తర్వాత వైజయంతీ మూవీస్‌లో నేను చేసిన సినిమా ‘అన్నీ మంచి శకునములే’. ఇందులో ఆరు పాటలు ఉన్నాయి.

నందినీ రెడ్డిగారు కథ చెప్పినప్పుడు ఎగ్జైట్‌ అయ్యాను. అలాగే కథలో ఆమె క్రియేట్‌ చేసిన విక్టోరియాపురం ఆడియన్స్‌ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న రెండు సినిమాలకు, దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలగారితో ఓ ప్రాజెక్ట్, ‘చాంపియన్‌’ అనే మరో ప్రాజెక్ట్, ‘సెల్ఫిష్‌’, అమెరికాలో ఉన్న మరో దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. 

మరిన్ని వార్తలు