Anni Manchi Sakunamule: అందమైన బంధాలు, భావోద్వేగాలతో ఆకట్టుకుంటున్న టీజర్‌

5 Mar, 2023 13:11 IST|Sakshi

సంతోష్‌ శోభన్, మాళవికా నాయర్‌ జంటగా రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. స్వప్న సినిమాస్, మిత్ర విందా మూవీస్‌తో కలిసి బీవీ నందినీ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రియాంకా దత్‌ నిర్మించారు. మే 18న ఈ చిత్రం విడుదల కానుంది. మార్చి 4న నందినీ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను హీరో దుల్కర్‌ సల్మాన్‌ సోషల్‌ మీడియా ద్వారా రిలీజ్‌ చేశారు. ‘‘కొండ ప్రాంతం నేపథ్యంలో జరిగే కథ ఇది. అందమైన బంధాలు, భావోద్వేగాలతో మంచి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా నందినీ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.  రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేశ్‌, షావుకారు జానకి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

మరిన్ని వార్తలు