Godfather: బాలీవుడ్‌లో ‘గాడ్‌ ఫాదర్‌’ హవా.. 600 స్క్రీన్స్‌ పెంపు

8 Oct, 2022 12:27 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన లేటెస్ట్‌ మూవీ ‘గాడ్‌ ఫాదర్‌’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. హిందీలో గాడ్‌ ఫాదర్‌కు వస్తున్న రెస్పాన్స్‌తో అక్కడ మరో 600 స్క్రీన్స్‌ని పెంచినట్లు చిరంజీవి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

(చదవండి: వెనక్కి తగ్గా.. ఓడిపోలేదు.. సమంత పోస్ట్‌ వైరల్‌)

‘గాడ్‌ ఫాదర్‌’పై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానానికి నా ధన్యవాదాలు.  ఈ చిత్రం విడుదలైన రెండు రోజుల్లోనే రూ.69 కోట్ల వసూళ్లను రాబట్టినందుకు ఆనందిస్తున్నా.  ఈ రోజు(అక్టోబర్‌ 8) నుంచి హిందీ బెల్ట్‌లో మరో 600 స్క్రీన్స్‌ని పెంచుతున్నాం. మా చిత్రాన్ని పాన్‌ ఇండియా మూవీగా చేసిన ప్రేక్షకులకు, నా అభిమానులకు ధన్యవాదాలు .జై హింద్‌’అని చిరంజీవి చెప్పుకొచ్చాడు. మోహన్‌ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌, సత్యదేవ్‌, నయనతార ఇతర కీలక పాత్రల్లో నటించారు. తమన్‌ సంగీతం అందించారు.

మరిన్ని వార్తలు