Ante Sundaraniki Review: ‘అంటే..సుందరానికీ’ ట్విటర్‌ రివ్యూ

10 Jun, 2022 07:14 IST|Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన లెటెస్ట్‌ మూవీ ‘అంటే..సుందరానికీ’.‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్‌ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్‌ హీరోయిన్‌గా నటించింది. ప్యూర్‌ కామెడీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్‌ అమ్మాయిగా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

బ్రాహ్మణ కుర్రాడు, క్రిస్టియన్ అమ్మాయిల మధ్య ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. చాలా కాలం తర్వాత నాని మరోసారి కామెడీ చిత్రంతో వస్తుండటంతో ‘అంటే..సుందరానికీ’కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం నేడు(జూన్‌ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘అంటే సుందరానికీ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. 

‘అంటే సుందరానికీ’లో కామెడీ, ఎమోషనల్‌ రెండూ వర్కౌట్‌ అయ్యాయి. ఒక్కోసారి లెంగ్తీగా అనిపించినా, రొటీన్‌ కామెడీ సీన్స్‌ ఉన్నప్పటికీ సినిమా ఎంగేజింగ్‌గా ఉంటుంది. భావోద్వేగాలు బాగా పనిచేశాయి. నాని, నజ్రియా, మిగతా నటీనటులు పర్ఫెక్ట్‌గా నటించారు. ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు

ఫస్టాఫ​ బాగుంది. సెకండాఫ్‌ చాలా బాగుంది. వివేక్‌ ఆత్రేయకు మరో విజయం దక్కింది. నాని, నజ్రియా, హర్షవర్థన్‌, నరేశ్‌ల యాక్టింగ్‌ బాగుంది అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

సెకండాఫ్‌, క్లైమాక్స్‌ అదిరిపోయింది. కానీ ఫస్టాఫ్‌ చాలా స్లోగా ఉంది.నాని, నజ్రియ జంట తెరపై బాగుంది. వివేక్‌ సాగర్‌ చక్కటి బీజీఎం అందించాడు అని ఓ నెటిజన్‌ చెప్పుకొచ్చాడు. 

మరిన్ని వార్తలు