నేను చాలా లక్కీ: అనూప్‌ రూబెన్స్‌

1 Oct, 2020 08:47 IST|Sakshi

రాజ్‌తరుణ్, మాళవికా నాయర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వంలో శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో కేకే రాధామోహన్‌ నిర్మించారు. నేడు ఆహా ఓటీటీ చానల్‌ ద్వారా ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు అనూప్‌ రూబెన్స్‌  మీడియాతో చెప్పిన విశేషాలు.

  • ‘ఒరేయ్‌ బుజ్జిగా’ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. దర్శకుడు విజయ్‌కుమార్‌ కొండాతో ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలాకోసం’, సినిమాల తర్వాత ‘ఒరేయ్‌ బుజ్జిగా’ హ్యాట్రిక్‌ ఫిల్మ్‌ చేశాను. దేనికదే విభిన్నంగా ఉండే ఈ సినిమాలోని ఐదు పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 
  • లాక్‌డౌన్‌లో మ్యూజిక్‌ చేశాను, కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి ఉండేది. కారణం అంతకుముందు దర్శకుడు, నిర్మాత అందరూ కలిసి కూర్చుని ఇక్కడ ఇలా చేస్తే బావుంటుంది, అలా చేస్తే బావుంటుంది అని చర్చించుకుని సినిమాకి సంగీతం చేసేవాళ్లం. ఒక్కడినే ఇంటిదగ్గర కూర్చుని మ్యూజిక్‌ చేయటం కష్టంగా అనిపించింది. 
  • ఈ సినిమాలోని ‘ఈ మాయ పేరేమిటో...’ అనే సాంగ్‌ పర్సనల్‌గా నాకెంతో ఇష్టం. అలాగే ‘కృష్ణవేణి..’ అనే పాట కూడా ఇష్టం. ఎందుకంటే ఆ పాటలో రాజ్‌తరుణ్‌ డ్యాన్స్‌ ఇరగదీశాడు. ఒక సినిమాకి సంగీతం అందించేటప్పుడు హీరోని, కథను దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్‌ చేస్తాను. 
  • ఒక సంగీత దర్శకునిగా నాకు అన్ని రకాల సినిమాలు చేయటం ఇష్టం. లక్కీగా ‘ఇష్క్‌’, ‘మనం’, ‘గోపాల గోపాల’, ‘టెంపర్‌’, ‘కాటమరాయుడు’, ‘పైసా వసూల్‌’, ‘పూలరంగడు’, ‘సోగ్గాడే చిన్నినాయనా’... ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా డిఫరెంట్‌ జోనర్స్‌లో సినిమాలు చేసే అవకాశం అభించింది. ఇప్పటివరకు 55 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు. 
  • ప్రసుత్తం రాధామోహన్‌గారు నిర్మిస్తున్న ‘ఓదెల రైల్వేస్టేషన్‌’, రాజ్‌తరుణ్‌–విజయ్‌కుమార్‌ కొండా కాంబినేషన్‌లో మరో సినిమా చేస్తున్నాను. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు ఉన్నాయి. అలాగే ఈ లాక్‌డౌన్‌లో కొన్ని ప్రైవేట్‌ సాంగ్స్‌ రికార్డ్‌ చేశాను. మంచి టైమ్‌ చూసుకుని ఈ పాటలను విడుదల చేస్తాను.
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా