సల్మాన్‌ఖాన్‌ కాదండీ.. ఇంతకీ ఎవరండీ?

2 Mar, 2021 14:18 IST|Sakshi

తిండి కలిగినంత మాత్రాన ‘కండ’ కలదు... అనే విషయంలో గ్యారెంటీ ఏమీలేదు. తిండికి తగినట్లు తగిన వ్యాయామాలు చేయాలి. అప్పుడే కండ. లేనిచో ‘బొజ్జ కలదోయ్‌’ అనుకోవాల్సి వస్తుంది. ఫిన్‌నెస్‌పై శ్రద్ధ పెట్టడం అనేది శారీరక, మానసిక ఆరోగ్యానికి మస్తు మంచిది అనే విషయం తెలిసినా చాలామంది ‘ఆ..ఈ వయసులో ఏంచేస్తాం లెండి’ అని తప్పించుకుంటుంటారు. కొందరేమో ‘బిజీ’ అంటూ సాకులు వెదుక్కుంటారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ను చూడండి. అతని వయసు 65 సంవత్సరాలు. ‘ఈ వయసులో ఏమిటీ’ అని ఎప్పుడూ అనుకోలేదు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూనే ఉంటారు. రకరకాల కసరత్తులతో చూడముచ్చటగా తీర్చిదిద్దుకున్న తన బాడీకి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు ఖేర్‌. ‘ఎన్నడూ ఒప్పుకోవద్దు ఓటమి’ అని కామెంట్‌ కూడా పెట్టారు. అంతే కదా మరి! 

చదవండి: పవన్‌ కల్యాణ్ అడిగితే.. ఆయనకు 4వ భార్యగా ఉంటా..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు