Anupam Kher: బాలీవుడ్‌లో నా స్నేహితులే నన్ను పక్కన పెట్టేశారు

27 Aug, 2022 17:51 IST|Sakshi

కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాతో బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ పేరు మార్మోగిపోయింది. 500కు పైగా సినిమాల్లో నటించిన ఈయన ఈమధ్య హిందీ చిత్రాల్లో పెద్దగా కనిపించడం లేదు. కశ్మీర్‌ ఫైల్స్‌, కార్తికేయ 2 సినిమాలతో హిట్స్‌ అందుకున్న ఆయన బాలీవుడ్‌ మూవీస్‌లో కనిపించకుండా పోవడానికి గల కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

'మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమాలో నేను లేకుండా పోయాను. కరణ్‌ జోహార్‌, సాజిద్‌ నదియావాలా, ఆదిత్య చోప్రా సినిమాలు ఒక్కటి కూడా చేయడం లేదు. కారణం.. వాళ్లు నాకు ఒక్క ఆఫర్‌ కూడా ఇవ్వట్లేదు. ఒకప్పుడు వీళ్లందరికీ నేను డార్లింగ్‌.. వీళ్లు తీసిన సినిమాల్లో నేనూ ఉన్నాను. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పోనీలే.. నన్ను వారి మూవీస్‌లోకి తీసుకోనందుకు నేను వాళ్లను తప్పుపట్టడం లేదు. కానీ వాళ్లు నాకు ఛాన్స్‌ ఇవ్వకపోవడం వల్లే నేను వేరే దారి వెతుక్కున్నాను.. అలా తమిళ సినిమా కనెక్ట్‌ చేశాను. తెలుగులో టైగర్‌ నాగేశ్వరరావు చేశాను. హిందీలో సూరజ్‌ బర్జాత్యా ఊంచై చేశాను. కానీ నా స్నేహితులు నన్ను పక్కన పెట్టేసినందుకు బాధేసింది. ఒక ద్వారం మూసుకున్నా మరోవైపు ఎన్నో ద్వారాలు తెరుచుకుంటాయి అని చెప్పుకొచ్చాడు.

చదవండి: బ్రహ్మాస్త్ర గ్రాండ్‌ ఈవెంట్‌: ముఖ్య అతిథిగా యంగ్‌ టైగర్‌
అనసూయ వివాదం.. నన్నెందుకు తిడుతున్నారు?

మరిన్ని వార్తలు