ఈ పెళ్లికొడుకు ఫేమస్‌ నటుడు.. గుర్తుపట్టారా?

26 Aug, 2022 16:18 IST|Sakshi

పూలదండల చాటున ఉన్న ఈ వధూవరులెవరో గుర్తుపట్టారా? ఈ నటుడు ఈ మధ్య వరుస విజయాలు అందుకోవడంతో ఇండియా అంతటా అతడి పేరు మార్మోగిపోతోంది. అతడు మరెవరో కాదు అనుపమ్‌ ఖేర్‌. ఈరోజు ఆయన పెళ్లిరోజు!

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఫుల్‌ జోష్‌ మీదున్నాడు. తాను నటించిన రెండు సినిమాలు కశ్మీర్‌ ఫైల్స్‌, కార్తికేయ 2 ఘన విజయం సాధించడంతో సంతోషంలో మునిగి తేలుతున్నాడు. శుక్రవారం(ఆగస్టు 26) అనుపమ్‌- కిరణ్‌ ఖేర్‌ల పెళ్లిరోజు. ఈ సందర్భంగా అతడు సోషల్‌ మీడియాలో తన పెళ్లి  ఫొటో షేర్‌ చేశాడు. 'హ్యాపీ యానివర్సరీ కిరణ్‌. ఇటీవల నేను సిమ్లా వెళ్లినప్పుడు మా నాన్నగారి ట్రంకు పెట్టెలో నుంచి 37 ఏళ్ల క్రితం దిగిన ఈ ఫొటోను బయటకు తీశాను. ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చాడు.

ఇక ఈ ఫొటోలో బంగారు రంగు చీరను ధరించిన కిరణ్‌ ఒంటి నిండా నగలతో ధగధగా మెరిసిపోతుంది. అనుపమ్‌ సింపుల్‌గా ఓ ధోతీ ధరించాడు. వీరిద్దరి మెడలోనూ పూలమాలలు ఉన్నాయి. కాగా అనుపమ్‌, కిరణ్‌లు 1985లో పెళ్లి చేసుకున్నారు. ఇది కిరణ్‌ ఖేర్‌కు రెండో వివాహం. ఇదిలా ఉంటే అనుపమ్‌ ప్రస్తుతం కంగనా రనౌత్‌ ఎమర్జెన్సీ మూవీలో నటిస్తున్నాడు. రాజకీయ నాయకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ పాత్ర పోషిస్తున్నాడు. అలాగే అతడు ఐబీ 71, ఊంచై సినిమాలు చేస్తున్నాడు.

చదవండి: కేజీఎఫ్‌ నటుడికి క్యాన్సర్‌, మూడేళ్లుగా దాచిపెట్టాడు!
బాలీవుడ్‌ స్టార్లను అమ్ముకుంటుంది: అనుపమ్ ఖేర్‌ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు