నా విస్కీకి నాలుగేళ్లు : హీరోయిన్‌ అనుపమ

24 Apr, 2021 14:24 IST|Sakshi

హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ షేర్‌ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. తాజాగా తన విస్కీకు నాలుగేళ్లు పూర్తయ్యాయంటూ అనుపమ చేసిన ఓ పోస్ట్‌ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. విస్కీ అంటూ ఏదో మందు బ్రాండ్‌ అనుకునేరు..అనుపమ ఎంతో పప్రేమగా పెంచుకుంటున్న కుక్కపిల్ల పేరు. హీరోయిన్‌ అనుపమకు కుక్కలంటే విపరీతమైన ఇష్టమని ఆమెని ఫాలో అవుతున్న వాళ్లకి తెలిసిందే.

పెట్స్‌పై ఎంతో పప్రేమ కురిపించే అనుపమ తన విస్కీ పుట్టినరోజును సెలబ్రేట్‌ చేసింది. దీనికి సంబంధించిన కుక్కతో దిగిన ఫోటోలను షేర్‌ చేసింది. గతేడాది చాలా కష్టంగా సాగింది. విస్కీ సోదరుడు ట‌డ్డీ, ర‌మ్‌ల‌ను కోల్పోయి ఎంతో బాధపడుతున్న మా జీవితాల్లో సంతోషం తీసుకొచ్చిన విస్కీకి కృతఙ్ఞతలు అంటూ కుక్కపిల్లపై ఎంతో పప్రేమ కురిపించింది. ఇక సినిమాలవ విషయానికి వస్తే అనుపమ చివరగా బెల్లంకొండ శ్రీనివాస్‌తో రాక్షసుడు అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం తెలుగులో 18 పేజీస్‌తో పాటు.. త‌మిళంలో త‌ల్లిపొగ‌తే అనే చిత్రంలో న‌టిస్తోంది ఈ భామ. 

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

చదవండి:  సంజనతో బుమ్రా పెళ్లి.. హర్ట్‌ అయిన అనుపమ
సిద్‌ శ్రీరామ్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు