Anupama Parameswaran: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ బట్టర్‌ఫ్లై మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

29 Dec, 2022 13:46 IST|Sakshi

అనుపమ పరమేశ్వరన్‌ ప్రస్తుతం బ్యాక్‌ టూ బ్యాక్‌ చిత్రాలతో అలరిస్తోంది. ఓ వైపు గ్లామర్‌ పాత్రలు పోషిస్తూనే.. మరోవైపు నటన ప్రాధాన్యమున్న పాత్రలతో మెప్పిస్తుంది.  ఈ ఏడాది ‘కార్తికేయ-2’ మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ రీసెంట్‌గా ‘18పేజెస్‌’తో మరో విజయం ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 18 పేజెస్‌ మూవీ సక్సెస్‌ని ఆస్వాదిస్తోన్న అనుపమ మరో చిత్రం బటర్‌ ఫ్లై. ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేసింది.  

చదవండి: షారుక్‌ పఠాన్‌ చిత్రానికి సెన్సార్‌ బోర్డు షాక్‌, మూవీ టీంకు బోర్డు ఆదేశం..

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గత రాత్రి నుండి హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇప్పటికే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్‌లు, టీజర్‌ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ చేశాయి. ఈ ఏడాది ప్రథమార్థంలోనే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో హాట్‌స్టార్‌ నుండి మంచి ఆఫర్‌ రావడంతో మేకర్స్ ఓటీటీ వైపు మొగ్గుచూపారు. ఘంటా స‌తీష్‌బాబు ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ సినిమాలో నిహాల్ కోద‌త్య్, భూమిక చావ్లా కీల‌క పాత్రల్లో నటించారు. జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యాన‌ర్‌పై ర‌విప్ర‌కాష్ బోడ‌పాటి, ప్ర‌సాద్ తిర‌వ‌ళ్లూరి, ప్ర‌దీప్ న‌ల్లిమెల్లి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

చదవండి: మరో వివాదంలో రష్మిక, సౌత్‌ ఇండస్ట్రీపై అవమానకర వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు