బుమ్రాతో పెళ్లిపై అనుపమ తల్లి క్లారిటీ

6 Mar, 2021 16:12 IST|Sakshi

టీమిండియా బౌలర్‌ జస్‌ప్రీత్ బుమ్రా‌ ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టు నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఆయన పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలోనే బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నాడని అందుకే అతడు ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌ వదులుకున్నట్లు ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ లక్కీ గర్ల్‌ ఎవరని ఆరా తీశారు బుమ్రా అభిమానులు. గతంలో తన ఫేవరెట్‌ క్రికెటర్‌ బుమ్రా అని, అతడంటే ఇష్టమని దక్షిణాది భామ, ప్రముఖ హీరోయిన్‌ అనుపమా పరమేశ్వర్‌ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో బుమ్రా, అనపమాలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ గాసిప్స్‌ వచ్చాయి. ఈ క్రేజీ రూమర్‌ కాస్తా నెట్టింట్లో  చర్చనీయాంశంగా మారింది.

దీంతో అనుపమ తల్లి సునీత పరమేశ్వరన్‌ స్పందించారు. మాలయాళ పోర్టల్‌తో మాట్లాడుతూ.. వారిద్దరి పెళ్లిపై వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. ‘తన కూతురు అనుపమ, బుమ్రాలు కేవలం స్నేహితులు మాత్రమే. వారిపై పెళ్లంటు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఒక తెలుగు సినిమా షూట్‌ కోసం అనుపమా గుజరాత్‌ వెళ్లింది తప్ప మరే కారణం లేదు’అని ఆమె స్పష్టం చేశారు. అంతేగాక ఈ వార్తలు రావడంతో అనుపమ, బుమ్రాలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరిని ఒకరూ అన్‌ఫాలో చేసుకున్నారని కూడా చెప్పారు.

ఓ మూవీ షూటింగ్‌ సమయంలో అనుపమా, బుమ్రాలు తొలిసారిగా ఓ హోటల్‌లో కలుసుకున్నారని అదే చివరిది అని పేర్కొన్నారు. కేవలం దాన్ని ఆధారంగా చేసుకుని వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు సృష్టించడం సరైనది కాదని ఆమె అన్నారు. దీంతో తాజాగా మరో యువతి పేరు తెర మీదకు వచ్చింది. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టు సంజనా గణేషన్‌ను బుమ్రా పెళ్లాడబోతున్నాడని సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల సంజన ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా సీజన్‌ 7 తో కెరీర్‌ ఆరంభించారు.  అయితే ఇది ఎంతవరకు నిజమన్న దానిపై క్లారిటి లేదు.

చదవండి:
 హీరోయిన్‌ కాదు: బుమ్రాను పెళ్లాడేది ఆమేనా!

 ఆ హీరోయిన్‌ని బుమ్రా పెళ్లాడబోతున్నాడా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు