కేబీసీ: రూ. 25 లక్షల ప్రశ్నకు సమాధానం తెలుసా!

7 Nov, 2020 14:54 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న పాపులర్‌ గేమ్‌ షో ‘కౌన్‌ బనేగా కరోడ్ పతి’‌ ప్రస్తుతం సీజన్‌ 12 కొనసాగుతోంది. ఈ షో ద్వారా ఎంతో మంది ప్రపంచానికి హీరోల్లాగా పరిచయమ​య్యారు. అలాగే చాలామంది కష్టాలను ఈ షో తీర్చింది. సామాన్యులను రాత్రికి రాత్రి సెలబ్రెటీలుగా మార్చడమే కాకుండా వారిని ఆర్థికంగా కూడా ఆదుకుంది. అయితే ఇటీవల ఢిల్లీకి చెందిన కంటెస్టెంట్‌ రూ. కోటి ప్రశ్నకు సమాధానం వరకు చేరుకుని కేబీసీలో చరిత్రలోనే తొలి కంటెస్టెంట్‌ అయ్యారు. ఆ తర్వాత వరుస ఎపిసోడ్స్‌లో రూ. 25, రూ. 50 లక్షల ప్రశ్నలకు వరకు వెళ్లి ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌ సంచలనం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో కూడా నటి రత్నా ప్రతాక్‌ షా, స్వయం డైరెక్టర్‌, వ్యవస్థాపకురాలు కరమ్‌వీర్‌ అనురాధ కపూర్‌లు ఇద్దరూ కలిసి రూ. 25 లక్షల గెలుచుకున్నారు. రూబి సింగ్‌ అనే మరో కంటెస్టెంట్‌ కూడా ఈ ఎపిసోడ్‌లోనే రూ. 25 లక్షలు గెలుచుకోవడం విశేషం.

నిన్నటి  ఎపిసోడ్‌ కంటెస్టెంట్స్‌ రూబి సింగ్‌, కరమ్‌ వీర్‌ అనురాధ కపూర్‌లు రూ. 25 లక్షల గెలుచుకున్నారు. ఒకరి త్వరాత ఒకరూ హాట్‌సీట్‌కు వెళ్లిన వీరిద్దరూ 14వ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక తప్పుకున్నారు. మొదట హాట్‌సీట్‌కు వచ్చిన రూబిసింగ్ 13 ప్రశ్నలకు సమాధానం ఇచ్చి రూ. 25 లక్షలు గెలుచుకున్న ఆమె 14వ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయారు. అన్ని లైఫ్‌లైన్‌లు కూడా అయిపోవడంతో ఆమె గేమ్‌ నుంచి వైదొలగారు. అయితే రూబి సింగ్‌ సమాధానం ఇవ్వలేని రూ. 50 లక్షలు ప్రశ్నకు సమాధానం మీకు తెలుసోమో ఒకసారి చూడండి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రచురించిన న్యూస్‌ పేపర్‌ ఎంటి? అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వలేకపోయారు. అయితే దీని సమాధానం  బెంగాల్‌ గెజిట్‌ న్యూస్‌ పేపర్‌. 


ఇర రూబి సింగ్‌ తర్వాత బిగ్‌బీ‌ అనురాధ కపూర్‌తో పాటు రత్నా ప్రతాక్‌ షాలను హాట్‌ సీట్‌కు స్వాగతించారు.  వీరిద్దరూ కలిసి 13 ప్రశ్నలకు సమాధానం ఇచ్చి రూ. 25 లక్షలు గెలుచుకున్నారు. వీరు కూడా 14వ కిస్సా-ఇ-సంజన్ ప్రకారం, గుజరాత్‌లోని పార్సీలకు ఏ రాజు ఆశ్రయం ఇచ్చాడు, అక్కడ వారు సంజన్ స్థావరాన్ని స్థాపించారు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం జాడి రత్న. దీనికి నాలుగు ఆప్షన్‌లలో ‘ద్రోణసింహ, జాడి రత్నా, ములరాజా, నవగన’ అనే నాలుగు ఆప్షన్స్‌ ఇచ్చారు. వారికి సమాధానం తెలియకపోవడం, లైఫ్‌లైన్‌లు కూడా‌ లేకపోవడంతో గేమ్‌ నుంచి తప్పుకున్నారు. 

మరిన్ని వార్తలు