అనురాగ్‌కు మద్దతుగా నిలిచిన కల్కి కోచ్లిన్‌

21 Sep, 2020 13:07 IST|Sakshi

ముంబై: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న‌ దర్శక-నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌కు పలువురు బాలీవుడ్‌ నటులు మద్దుతగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాజీ భార్య నటి కల్కి కోచ్లిన్‌ కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో కల్కి... ‘ప్రియమైన అనురాగ్‌ సోషల్‌ మీడియాల్లో వస్తున్న పుకార్లను మీరు పట్టించుకోకండి. మీ స్కిప్ట్‌లో మహిళల స్వేచ్చ కోరే వ్యక్తి. వ్యక్తిగతంగా కూడా పరిశ్రమలో మహిళల సమగ్రతను సమర్థిస్తారు. దానికి నేనే సాక్ష్యం. వ్యక్తిగతంగా, వృత్తిపరమంగా నన్ను ఎప్పుడూ మీతో సమానంగా చుశారు. మన విడాకుల తర్వాత కూడా నా చిత్తశుద్ధి కోసం నిలబడ్డారు. నేను నా వర్క్‌ ప్లేస్‌లో అసౌకర్యం, అసురక్షితకు లోనైనప్పుడు మీరు నాకు మద్దతుగా నిలిచారు’ అంటూ కల్కి రాసుకొచ్చారు. (చదవండి: అనురాగ్‌ నన్ను ఇబ్బందిపెట్టాడు)

అంతేగాక ‘‘ఈ సమయం చాలా ప్రమాదకరమైనది. నిజానిజాలు తెలుసుకోకుండా ప్రతి ఒక్కరూ విమర్శించడం, తప్పుడు వాదనలు చేస్తారు. ఇది స్నేహితులను, బంధువులను, కుటుంబాలను నాశనం చేస్తుంది. అలాగే అవసరమైన సమయంలో ప్రేమ పంచే మనుషులే కాకుండా.. చూట్టు ఎవరూ లేనప్పుడు దయ, చూపే వ్యక్తులు కూడా ఉంటారు. అది మీకు కూడా తెలుసు. అయితే అలాంటి గౌరవానికే మీరు కట్టుబడి ఉండండి. ధైర్యంగా ఉండండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి’’ అంటూ ఆమె ప్రకటన విడుదల చేశారు. అయితే దర్శకుడు అనురాగ్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి పాయల్‌ శనివారం ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ స్పందిస్తూ.. వెంటనే అనురాగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం  బాలీవువడ్‌లో‌ ఇలాంటివి సర్వసాధరమని, ఇకనైన ఇలాంటి ఘటనపై స్పందించాలన్నారు. అనురాగ్‌ వంటివి వాళ్లను అరెస్టు చేసి మరోసారి ఇలాంటివి జరగకుండా అడ్డుకట్ట వేయాలని మండిపడ్డారు. (చదవండి: నేనెప్పుడూ అలా ప్ర‌వ‌ర్తించ‌లేదు: అనురాగ్‌)

@anuragkashyap10

A post shared by Kalki (@kalkikanmani) on

మరిన్ని వార్తలు