మెగాస్టార్‌ సినిమాను రిజెక్ట్‌ చేసిన బాలీవుడ్‌ దర్శకుడు

17 Apr, 2021 15:57 IST|Sakshi

మలయాళంలో సూపర్ హిట్‌ విజయం సాధించిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగు రీమేక్‌లో మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.  జయం మోహ‌న్ రాజా దర్వకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారు. సురేరేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగులో రీమేక్‌కి బైరెడ్డి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం  జ‌న‌వ‌రి 21న లాంఛ‌నంగా ప్రారంభమయ్యింది.
(చదవండి: కరోనా దెబ్బకు వెనకడుగు వేస్తున్న మెగాస్టార్‌)

ఏప్రిల్‌ నెలలో సినిమా మొదటి షెడ్యూల్‌ పూర్తి కావాల్సి ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుండటంతో షూటింగ్‌ను వాయిదా వేశారు. కాగా తాజా సమాచారం ప్రకారం లూసిఫర్‌ సినిమాకు విలన్‌ వేటలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు సమాచారం. చిరంజీవిని ఢీకొనే ప్రతినాయకుడి పాత్ర కోసం బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ మెగాస్టార్‌తో నటించే అవాకాశాన్ని అనురాగ్‌ నిరాకరించినట్లు వినికిడి. దీనికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

(చదవండి: సినీ నటి రాధ కేసులో యూటర్న్‌..)

ఇక అనురాగ్‌ నో చెప్పడంతో మరో కొత్త విలన్‌ కోసం మూవీ నిర్మాతలు జల్లెడ పడుతున్నారు. లుసిఫార్ రీమేక్‌ను ఈ ఏడాది పూర్తి చేసి వచ్చే సంక్రాంతి అనంతరం రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉండగా .. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం లూసిఫర్‌లో ఎంటర్‌ కానున్నారు.

చదవండి: ఆచార్యలో రామ్‌చరణ్‌ పాత్ర అదే

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు