-

RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌... అనురాగ్ అంచనాలు నిజమైతే!

17 Aug, 2022 14:02 IST|Sakshi

ఇండియన్ సినిమాకు ఆస్కార్ అన్నది ఒక కల. ప్రతీ ఏటా మనం సినిమాను ఎంపిక చేసి ఆస్కార్ కమిటీకి పంపడం.. వారు మన సినిమాను రిజెక్ట్ చేయడం పరిపాటిగా మారింది. కాని 2023 ఆస్కార్ కు ఇండియా నుంచి వెళ్లే సినిమాను ఎంపిక చేయాల్సి వస్తే గుడ్డిగా ఆర్ ఆర్ ఆర్ ను సెలక్ట్ చేయమంటున్నాడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ అవార్డ్ ఈవెంట్ కు మన దేశం తరుపున కమిటీ కనుక ఆర్ ఆర్ ఆర్ ను సెలక్ట్ చేసి పంపితే ఉత్తమ విదేశి చిత్రం క్యాటగరీలో  ఆస్కార్ అందుకోవడానికి 99 శాతం చాన్స్‌ ఉందని అభిప్రాయపడ్డాడు.

తాప్సీ ప్రధాన పాత్రలో అనురాగ్‌ కశ్యప్‌  తెరకెక్కించిన హిందీ చిత్రం ‘దోబారా’. ఆగస్ట్ 19న ఈ చిత్రం విడుదల కాబోతుంది. కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా అనురాగ్‌ మీడియాతో మాట్లాడుతూ ఆర్‌ఆర్‌ఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా నుంచి అధికారిక ఎంట్రీ లభిస్తే.. ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్‌ లభించే అవకాశం ఉందని చెప్పారు.

(చదవండి: తాప్సీపై డైరెక్టర్‌ వల్గర్‌ కామెంట్స్‌, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు)

హాలీవుడ్‌పై ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ప్రభావితం చేసిందని, అక్కడ తెరకెక్కిన మార్వెల్‌ మూవీస్‌ కంటే కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ హాలీవుడ్ ఆడియెన్స్ కు బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు అనురాగ్. ఇక వెరైటీ అనే మరో హాలీవుడ్ మ్యాగజైన్ఆస్కార్ బెస్ యాక్టర్ క్యాటగరీస్ లిస్ట్ లో తారక్ కూడా ఎంపిక అయ్యే అవకాశం ఉందంటూ లిస్ట్ బయటపెట్టింది.మొత్తంగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన తర్వాత ఆర్ ఆర్ ఆర్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

మరిన్ని వార్తలు