నా కూతురిని చూస్తుంటే గర్వంగా ఉంది: అనురాగ్‌ కశ్యప్‌

28 Jun, 2021 21:26 IST|Sakshi

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ కూతురు అలియా కశ్యప్‌ చేసిన పనికి గర్వంగా ఫీల్‌ అవుతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు. కూతురు ఆలియాతో కలిసి రెస్టారెంట్‌కు లంచ్‌కు వెళ్లిన వీడియోను షేర్‌ చేస్తూ అసలు విషయం చెప్పాడు. ‘నా కూతురు ఈ రోజు నాకు లంచ్‌ ఆఫర్‌ చేసింది. తన సొంత డబ్బులతో ఈ రోజు నన్ను రెస్టారెంట్‌కు తీసుకువెళ్లింది’ అంటూ ఆలియా రెస్టారెంట్‌ బిల్‌ కడుతున్న వీడియోను అభిమానులు, సన్నిహితులతో పంచుకున్నాడు.

బిల్‌ కట్టిన అనంతరం అలియా తండ్రిని సినిమాలు ఆపేమని కూడా సూచించింది. ఇది ఆయనను మరింత గర్వపడేలా చేసిందంటూ అనురాగ్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా ఈ డబ్బులను ఆలియా తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా సంపాదించిందని, అలా వచ్చిన మొదటి సంపాదనతో తనకు లంచ్‌ ఆఫర్‌ చేసినట్లు ఆయన వెల్లడించాడు. ఇక అనురాగ్‌ వీడియోపై అనురాగ్‌ సినీ స్నేహితుడు గుల్సాన్‌ దేవయ్య స్పందిస్తూ.. ‘భవిష్యత్తులో ఆలియా నీ సినిమాలకు ఫైనాస్‌ ఇస్తుంది చూడు’ అంటూ కామెంట్స్‌ చేశాడు.

A post shared by Anurag Kashyap (@anuragkashyap10)

చదవండి: 
‘పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ’.. దర్శకుడిని ప్రశ్నించిన కుమార్తె

మరిన్ని వార్తలు