ఆ విషయంలో తగ్గేది లేదన్న స్వీటీ 

3 Aug, 2020 06:29 IST|Sakshi

గ్లామరస్‌ పాత్రల నుంచి లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల స్థాయికి ఎదిగిన నటి అనుష్క. బెంగళూరుకు చెందిన ఈ అమ్మడుని తెలుగు, తమిళ చిత్రాలు అగ్ర నటిగా చేశాయి. ప్రస్తుతం సెలెక్ట్‌ చిత్రాలనే చేస్తోంది. అనుష్క నటించిన తాజా చిత్రం సైలెన్స్‌ త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది. ఇది పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందింది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ఓ చిత్రం చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అదేవిధంగా ఒక తమిళ చిత్రంలో అవకాశం అనుష్కను వెతుక్కుంటూ వచ్చింది. దీన్ని ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో నటుడు విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటించనున్నారు. ఆయనకు జంటగా అనుష్క నటించడానికి సిద్ధమవుతోంది. (రజనీ రెడీ)

కాగా ఈ చిత్రం కోసం బ్యూటీ రూ.3 కోట్లు డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. అయితే అంత మొత్తాన్ని ఇవ్వడానికి దర్శక నిర్మాతలు నిరాకరించడంతో  బేరసారాలు జరిగినట్లు సమాచారం. తాను బహుభాషా నటినని, తన చిత్రాలకు తెలుగు, తమిళం తదితర భాషల్లో మంచి ఆదరణ ఉంటుందని, కాబట్టి తన పారితోషికం విషయంలో తగ్గే సమస్య లేదని అనుష్క కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రంలో నటించనున్న విజయ్‌ సేతుపతి రూ. 10 కోట్లు పారితోషికం ఇస్తుండగా తనకు రూ. 3 కోట్లు ఇవ్వడం న్యాయం అని అనుష్క పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో చేసేదిలేక చిత్ర దర్శక నిర్మాతలు ఈ బ్యూటీకి డిమాండ్‌ చేసిన మొత్తాన్ని ఇవ్వడానికి అంగీకరించక తప్పలేదని తెలిసింది. కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ లాక్‌ డౌన్‌ ముగిసిన తర్వాత సెట్‌ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.   

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా