Anushka Sharma-Virat Kohli: అనుష్కను దారుణంగా ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు, ఎందుకంటే..

7 Oct, 2022 16:52 IST|Sakshi

బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దారుణంగా ట్రోల్స్‌ ఎదుర్కొంటోంది. తన కూతురు వామిక ఫొటోలను తీస్తున్న మీడియాపై అనుష్క అసహనం వ్యక్తం చేసిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆమె తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. కాగా సెలబ్రెటీ కపుల్‌ అనుష్క-విరాట్‌ కోహ్లిలు ఇప్పటి వరకు తమ కూతురిని మీడియాకు చూపించకుండా జాగ్రత్త పడుతున్న సంగతి తెలిసిందే. వామిక పుట్టి ఏడాదిన్నర అవుతున్న ఇప్పటి వరకు కూతురు ఫొటోలు రివీల్‌ చేయలేదు ఈ జంట. 

చదవండి: ఆదిపురుష్‌ టీజర్‌: రావణుడిగా సైఫ్‌ లుక్‌పై ట్రోల్స్‌, వివరణ ఇచ్చిన డైరెక్టర్‌

దీంతో ఇంకా ఎంతకాలం దాస్తారు అంటూ ఫ్యాన్స్‌, నెటిజన్లు వీరిని ట్రోల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా కూతురు వామికతో కలిసి విరుష్కలు ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. వారిని చూసిన మీడియా తమ కెమెరాలకు పని చెప్పారు. అయితే ఇప్పుడు కూడా వారు వామికను మీడియా కంట పడకుండ జాగ్రత్త పడుతున్నారు. అయినప్పటి మీడియా ఫొటోలు తీస్తుండటంతో అనుష్క శర్మ వారి వంక అసహనంగా చూసింది. ‘ఏం చేస్తున్నారు, ఏంటీ?.. ఫొటోలు ఆపండి’ అన్నట్లు మీడియాపై ఆమె అసహనం చూపించింది. అయితే వామిక ఫొటోలు తీయడం లేదు అని అనడంతో ఆమె కాస్తా కూల్‌ అయ్యింది.

చదవండి: ‘పెళ్లి సందD’ హీరోయిన్‌ శ్రీలీల తల్లిపై కేసు

అనంతరం భర్త విరాట్‌తో కలిసి కెమెరాకు ఫోజులు ఇచ్చింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు విరుష్కలపై గుర్రుమంటున్నారు. ‘ఇంకా ఎంతకాలం వామికను చూపించకుండ దాస్తారు’, ‘అనుష్కకు ఇంత యాటిట్యూడ్‌ అవసరమా.. ఆమె యాటిట్యూడ్‌ చూపిస్తుంటే మీరేందుకు ఇంకా వారి వెనకాల పడుతున్నారు. వారి కూతురు ఫొటోలు తీయడం ఆపండి’, విరాట్‌ నువ్వు అయిన చెప్పొచ్చు కదా మేడంకి యాటిట్యూడ్‌ తగ్గించుకోమని’ , ‘ఎందుకు వాళ్ల వెంట పడుతున్నారు.. సాధారణ వ్యక్తుల్లాగే వారిని వదిలిలేయండి.. అప్పుడు తెలుస్తుంది వాళ్లకి’ అంటూ కామెంట్స్‌ చేస్తూ అనుష్కను ట్రోల్‌ చేస్తున్నారు. 

A post shared by Voompla (@voompla)

మరిన్ని వార్తలు