అనుష్క ఫొటోషూట్‌.. కోహ్లి కామెంట్‌

31 Dec, 2020 14:37 IST|Sakshi

ముంబై: తాను అభ్యుదయ భావజాలం ఉన్న కుటుంబం నుంచి వచ్చానని, తన సంతానాన్ని కూడా అలాగే పెంచుతానని బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ అన్నారు. ఇతరులను గౌరవించేలా విలువలు నేర్పుతానని పేర్కొన్నారు. ఈ క్రమంలో పైకి కాస్త కఠినంగా వ్యవహరించినట్లుగా కనిపించినా అందులో ప్రేమ ఇమిడి ఉందనే నిజాన్ని వారికి తెలిసేలా చేస్తానని చెప్పుకొచ్చారు. అనుష్క శర్మ- టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దంపతులు త్వరలోనే తల్లిదండ్రులుగా మారనున్న సంగతి తెలిసిందే. జనవరిలో అనుష్కకు వైద్యులు డెలివరీ డేట్‌ ఇచ్చారు. తొలి సంతానపు మధురానుభూతలతో కొత్త సంవత్సరానికి ఈ స్టార్‌ కపుల్‌ స్వాగతం పలుకనున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫ్యాషన్‌ మ్యాగజీన్‌ వోగ్‌ ఇండియా నిర్వాహకులు అనుష్క శర్మతో మెటర్నిటీ ఫొటోషూట్‌ నిర్వహించారు. (చదవండి: కోహ్లి- అనుష్కలకు బ్రెట్‌ లీ ఆహ్వానం!)

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘దాదాపుగా అన్ని విషయాల్లో మా ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. తల్లిదండ్రులుగా మారక ముందు నుంచే పేరెంటింగ్‌పై మాకు ఒక అవగాహన ఉంది. నేను అభ్యుదయ భావాలు గల కుటుంబం నుంచి వచ్చాను. ఇప్పుడు నా ఇంట్లో కూడా అదే వాతావరణం ఉంటుంది. మా పిల్లలు ఇతరులకు గౌరవం ఇచ్చేలా పెంచుతాం. విలువలతో కూడిన జీవనం సాగించేలా తీర్చిదిద్దుతాం. ఆకతాయిలుగా పెంచడం మాకు ఇష్టం లేదు’’ అని పిల్లల పెంపకం విషయంలో భర్త కోహ్లి, తన ఆలోచనల గురించి పంచుకున్నారు. కాగా అనుష్క తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు కోహ్లి సైతం.. ‘‘అందంగా ఉన్నావు’’ అంటూ భార్యకు కాంప్లిమెంట్‌ ఇచ్చాడు. 


 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు