కోహ్లి, వామికా ఫొటో షేర్‌ చేసిన అనుష్క; ఇలా చేశారేంటి వదినా!

12 Jul, 2021 08:44 IST|Sakshi

వామికా ఫొటోలు షేర్‌ చేసిన అనుష్క

ముఖం చూపించలేదంటూ హర్ట్‌ అయిన ఫ్యాన్స్‌

లండన్‌: ‘‘తన ఒక్క చిరునవ్వుతో మా చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం మారిపోతుంది. చిన్నారి పాపా... నువ్వు మా జీవితాల్లో నింపిన ప్రేమ ఇలాగే కలకాలం ఉండిపోవాలి’’ అంటూ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సతీమణి అనుష్క శర్మ.. తమ కూతురు వామికాపై ప్రేమను కురిపించారు. వామికా జన్మించి 6 నెలలు పూర్తైన సందర్భంగా... ‘‘మన ముగ్గురికి హ్యాపీ 6 మంత్స్‌’’ అంటూ చిన్నారితో దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. ఇందులో వామికాను గుండెలపై ఆడిస్తూ అనుష్క కనిపించగా, కోహ్లి తన గారాలపట్టిని ముద్దు చేస్తూ కనిపించాడు. అయితే, ఏ ఒక్క ఫొటోలోనూ వామిక ముఖం కనబడకుండా అనుష్క జాగ్రత్త పడ్డారు. 

ఈ క్రమంలో... సోనం కపూర్‌, కాజల్‌ అగర్వాల్‌, వాణీ కపూర్‌, సానియా మీర్జా, తహీరా కశ్యప్‌, అతియా శెట్టి వంటి సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఫ్యాన్స్‌ మాత్రం.. ‘‘అనుష్క వదినా ఇదేం బాగాలేదు. ఇప్పటికైనా వామికాను మాకు చూపిస్తారనుకుంటే ఇలా చేశారేంటి. ఏదేమైనా మీ చిన్నారి కూతురికి మా ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయి’’ అంటూ విరుష్క జోడీ తీరుపై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కాగా 2017లో పెళ్లి చేసుకున్న అనుష్క- విరాట్‌ కోహ్లి ఈ ఏడాది జనవరి 11న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పాపకు వామికా అని నామకరణం చేశారు. అయితే, మీడియాకు తమ బిడ్డను దూరంగా ఉంచాలని భావిస్తున్న విరుష్క దంపతులు ఇప్పటివరకు చిన్నారి ముఖచిత్రాన్ని మాత్రం పంచుకోలేదు. దీంతో వారి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక టెస్టు సిరీస్‌లో భాగంగా కోహ్లి ప్రస్తుతం భార్యాబిడ్డతో కలిసి ఇంగ్లండ్‌లో ఉన్నాడు. 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు